Telugu News » Blog » “అక్కినేని తొక్కినేని” అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పై అన్నాదమ్ముల కౌంటర్…మామూలుగా ఇవ్వలేదుగా…!

“అక్కినేని తొక్కినేని” అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పై అన్నాదమ్ముల కౌంటర్…మామూలుగా ఇవ్వలేదుగా…!

by AJAY
Published: Last Updated on
Ads

నటసింహం నందమూరి బాలకష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతి కి విడుదలైన ఈ సినిమా కోట్లు వసూలు చేస్తోంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా శ్రుతి హాసన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా మలయాళ నటి హనీ రోజ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

 

ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఇటీవల నిర్వహించారు. అయితే సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. కాగా బాలయ్య చేసిన కామెంట్ ల పై తాజాగా ఏఎన్ఆర్ మనవడు నాగచైతన్య స్పందించారు. నాగచైతన్య ఓ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Advertisement

ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వాళ్ళని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోడమే అంటూ పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ ను నాగార్జున రెండో కుమారుడు అఖిల్ కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ కి అక్కినేని అభిమానులు కామెంట్ లు పెడుతున్నారు. బాలయ్య అక్కినేనికి క్షమాపణ లు చెప్పాలని కోరుతున్నారు.

Advertisement