Home » 1959 లో బంగారం ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

1959 లో బంగారం ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా ప్రతీ భారతీయుడికి బంగారంతో భావోద్వేగ సంబంధం ఉంటుంది. భారతీయులు బంగారాన్ని సురక్షితంగా పెట్టుబడిగా భావిస్తారు. అంతేకాదు.. ప్రతీ కుటుంబానికి గౌరవం తీసుకొచ్చేది బంగారం మాత్రమే. ప్రతీ భారతీయుడి ఇంట్లో కచ్చితంగా కొంత మొత్తంలో బంగారం ఉండటానికి కారణం ఇదే. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో బంగారం, వెండి ధర ఎంత ఉంది. ఆ తరువాత 1959లో ఎంత ఉంది..? ప్రస్తుతం ఎంత ఉంది అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బంగారం 52వేల శాతం వరకు పెరిగింది. 1947లో 10 గ్రాముల (తులం) బంగారానికి రూ.88గా ఉంది. 1959లో మొట్టమొదటిసారిగా బంగారం 10 గ్రాములకు రూ.100 దాటింది. ఇక అదే సమయంలో 1974లో బంగారం 500 స్థాయిని దాటింది. ఇక 2007లో అయితే బంగారం ధర 10 గ్రాములకు రూ.10వేల మైలరాయిని దాటింది. 2011లో అయితే 10 గ్రాముల బంగారం కి రూ.26,000 అయితే.. ఇక ఆగస్టు 2020లో మాత్రం రికార్డు స్థాయిలో రూ.56,191 కి ఉండింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.56,750 గా పలుకుతోంది. రోజు రోజుకి 100 నుంచి 200 వరకు తగ్గడం, పెరగడం వంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  ముఖ్యంగా 1959లో 1 గ్రాము బంగారం ధర రూ.10 ఉండేది. ప్రస్తుతం ఒక గ్రాము బంగారం ధర రూ.5,500కి పైగా ఉండడం గమనార్హం. 

Advertisement

Also Read :   మీ ఇంట్లోకి ధనలక్ష్మీ అడుగుపెట్టాలంటే.. ఈ 7 నియమాలు తప్పక పాటించండి..!

స్వాతంత్య్రం వచ్చిన సమయంలో వెండి ధర కిలోకి  రూ.107 ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అది 58, 700 శాతం రాబడిని ఇచ్చింది. 1987లో కిలో వెండి ధర రూ.1000 దాటింది. 1987లో తొలిసారి రూ.5000 దాటింది.  వెండి తొలిసారి 2004లో రూ.10,000 దాటింది. 2008లో అయితే కిలో వెండి రూ.25,000 ఉండింది. 2020లో అయితే ఏకంగా గరిష్టంగా రూ.77, 949 కి చేరుకుంది. ప్రస్తుతం కూడా ఇదే ధర పలుకుతుంది. కాస్త అటు ఇటుగా రోజు రూ.100, రూ.200 తగ్గడం లేదా పెరగడం వంటి మార్పులు కనిపిస్తున్నాయి. 

Also Read :  ఈ స్టార్ క్రికెటర్ల కంటే కూడా వాళ్ల భార్యలు వయసులో పెద్ద.. లిస్ట్ లో 5 గురు..!

Visitors Are Also Reading