మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి సూపర్ జోష్ మీద ఉన్నారు. ఇటీవల వారి పెళ్లి రోజు వేడుకను ఇటలీలో జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీలోకి పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు. ఇక తొలి సినిమాతోనే స్టార్ హీరోగా మారారు రామ్ చరణ్. రెండవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ ఇక తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఆ తరువాత మాస్ సినిమాలను చేస్తూ ఓపెనింగ్ రికార్డు దగ్గర నుంచి పుల్ రన్ రికార్డ్స్ వరకు రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రంగస్థలం సినిమాతో మరొక రికార్డును సృష్టించారు రామ్ చరణ్. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడని ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన చూసి టాలీవుడ్ యువతులు కూడా ఆయనతో డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆయన పర్ఫామెన్స్ ఎంతగా వారిని ఆకట్టుకుందో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Advertisement
ఇది ఇలా ఉండగా.. రామ్ చరణ్ చైల్డ్ ఆర్టీస్ట్ గా నటించారు. అనే విషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఆయన కూడా ఓ సినిమాలో చైల్డ్ ఆర్టీస్ట్ గా నటించారు. చిరంజీవి 100వ సినిమాగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో లంకేశ్వరుడు సినిమా వచ్చిన విషయం విధితమే. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిరంజీవి పక్కనే ఒక సన్నివేశంలో ఓ అబ్బాయిని తీసుకోవాలి. ఆ సమయంలో ఎవరినీ తీసుకోవాలని దర్శకుడు ఆలోచనలో ఉండగానే సరదాగా మా అబ్బాయి చరణ్ అయితే ఎలా ఉంటుందని అడిగారట మెగాస్టార్ చిరంజీవి. ఇది చాలా అద్భుతమైన ఆలోచన అని దాసరినారాయణరావు ఆ సీన్లో రామ్‌చరణ్ ని తీసుకున్నారట. ఫైనల్ అవుట్ ఫుట్ చూస్తున్న సమయంలో ఆ సన్నివేశం ఎందుకో ఆసీన్కి సింక్ అవుతున్నట్టు అనిపించలేదట. దీంతో రామ్‌చరణ్ మీద తీసిన ఆ సన్నివేశాన్ని ఎడిటింగ్‌లో తొలగించారట.
Also Read :
ఉదయకిరణ్ తో తీయాలనుకున్న ‘సై’ సినిమాలో రాజమౌళి ఎందుకు హీరోను మార్చాడు..?
పుష్ప-2 లో శ్రీవల్లి పాత్రని ఎందుకు చంపేయబోతున్నారు ? పుష్ప నుంచి సంచలన విషయాలు లీక్ ..!