Home » పుష్ప-2 లో శ్రీవల్లి పాత్రని ఎందుకు చంపేయబోతున్నారు ? పుష్ప నుంచి సంచలన విషయాలు లీక్ ..!

పుష్ప-2 లో శ్రీవల్లి పాత్రని ఎందుకు చంపేయబోతున్నారు ? పుష్ప నుంచి సంచలన విషయాలు లీక్ ..!

by AJAY
Ad

క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన సినిమా పుష్ఫ‌. ఈ సినిమాను రెండు పార్టులుగా తీస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాను మొద‌ట ఒకే పార్ట్ లో తీయాల‌ని సుకుమార్ అనుకున్నారు. కానీ క‌థ దృశ్యా రెండు పార్టులుగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ పార్ట్ ను పుష్ప ది రైజ్ పేరుతో విడుద‌ల చేయ‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మొద‌టి సారి వైల్డ్ లుక్ లో క‌నిపించారు. పూర్తిగా మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాకు క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురిసింది.

Advertisement

తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవ‌ల్ లో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ న‌టించగా సునీల్, అన‌సూయ‌, ఫ‌హ‌ద్ ఫ‌జిల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఫ‌స్ట్ పార్ట్ క్లైమాక్స్ లో బ‌న్నీ ర‌ష్మిక‌ను వివాహం చేసుకుంటాడ‌న్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా కూలీ నుండి సిండికేట్ డాన్ గా ఎదుగుతాడు. అయితే సెకండ్ పార్ట్ స్టోరీ ఇదేనంటూ ఒక స్టోరీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Advertisement

సెకండ్ పార్ట్ మ‌ధ్య‌లోనే ర‌ష్మిక చ‌నిపోతుంద‌ని అంతే కాకుండా మ‌రో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంద‌ని టాక్. నిజానికి మొద‌ట సుకుమార్ క‌థ పూర్తిగా ర‌ష్మిక‌నే హీరోయిన్ గా అనుకున్నాడ‌ట‌. కానీ ఫ‌స్ట్ పార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో క‌థ‌కు మెరుగులు దిద్ది మరో టాప్ హీరోయిన్ ను రంగంలోకి దింపాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు తెలుస్తోంది.

pushpa

pushpa

అంతే కాకుండా ఫ‌స్ట్ పార్ట్ లో కూలి నుండి సిండికేట్ డాన్ గా ఎదిగిన అల్లు అర్జున్ సెకండ్ పార్ట్ లో విల‌న్ ఫ‌హ‌ద్ ఫాజిల్ చేతిలో దెబ్బ తింటాడ‌ని టాక్. అంతే కాకుండా సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ డౌన్ ఫాల్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మ‌రి కొన్ని లీకుల ప్ర‌కారంగా అయితే సినిమా ఎండింగ్ లో బ‌న్నీ మ‌ర‌ణిస్తాడ‌ని దాంతో సుక్కు ఓ మెసేజ్ ఇవ్వ‌బోతున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో ఎంతవ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే సెకండ్ పార్ట్ వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading