దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ సంచలన విజయం పరంపర కొనసాగుతున్న విషయం తెలిసినదే. అయితే ఆ సినిమాలో ఓ వైపు రామ్‌చరణ్, మరొక వైపు ఎన్టీఆర్ నటనతో పాటు సినిమాకు పాటలు కూడా హైలెట్‌గా నిలిచాయి. అందులో ముఖ్యంగా కొమురం భీముడో సాంగ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read : తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఎన్టీఆర్ సినిమా తీసిన నటుడు పద్మనాభం ! చివరికేమైందంటే ?
Advertisement
ముఖ్యంగా థియేటర్‌లో కొమురం భీముడో అనే సాంగ్ వచ్చినప్పుడు ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇటీవల ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఈ సినిమాలోని పాటను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొమురం భీముడో సాంగ్‌పై పెద్ద చర్చ జరుగుతూంది. రాసింది సుద్దాల అశోక్ తేజ. కీరవాణి దానికి సంగీతం అందించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఉండేటటువంటి భాష, యాస ముఖ్యంగా గోండు తెగకు సంబంధించిన ప్రజానికం వాడే పలు పదాలు ఈ పాటలో కనిపించడం విశేషం.
Advertisement
కొర్రాస్ నెగడోలే మండాలి కొడుకో.. అనగా ఒక ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఉండాలని, ఎక్కడ లొంగి పోవద్దని అర్థం. బ్రిటీషు ప్రభుత్వం కొమురంభీంను పట్టుకుని చిత్ర హింసలు పెట్టే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఎన్ని బాధలు, కష్టాలు పెడుతున్నా సరే వాటిని ఓర్చుకుని తిరగబడాలి. జ్వాల లాగా పైకి ఎగిసిపోవాలి. మరొక చలనం.. రగరాక సూర్యుడై రగలాలి కొడుకో అనేటటువంటి మరొక తెలంగాణ పదం వాడారు. అనగా అర్థం ఏమిటంటే..? మబ్బులు కమ్మినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఏవిధంగా వస్తుందో.. అదేవిధంగా నువ్వు స్ఫూర్తిని పొందాలి.
ఇక కాల్మొక్తా భాంచన్ అని వంగితే నిన్ను చంపేస్తారు. నీ జాతి పౌరుషాన్ని నువ్వు కోల్పోతావు. అలా చేయవద్దనే విధంగా ఒక మాట వాడారు కారడవి తల్లికి పుట్టనట్టేరో అని అన్నారు. జులుము గద్దెకు తలవంచి తోగల జుడుము తల్లి పేగున పెరగనట్టేరో.. జులుము గద్దెకు అనగా బ్రిటీషు ప్రభుత్వానికి సార్వభౌత్వానికి నువ్వు తల వంచితే అడవి తల్లి పేగున నువ్వను పెరగనట్టే అని అర్థం. చర్మం వలిచే దెబ్బకు ఒప్పంతోగాలా అనగా అర్థం ఏమిటంటే.. చర్మం వలిచేటప్పుడు తీవ్ర గాయాలు తట్టుకోలేకపోతే ధైర్యం కనుక నీకు చెదిరితే భూతల్లి సనుబాలు తాగనట్టేరో. ఈ పాటను కాలభైరవ పాడాడు. ఈ పాటకు కొమురంభీమ్ (ఎన్టీఆర్) అద్భుతంగా నటించాడు.
Also Read : KGFలో నటించిన అనంత్ నాగ్ ఎవరు..? ఆయన పాత్రను ఎందుకు రీప్లేస్ చేశారో తెలుసా…!