Telugu News » Blog » KGFలో న‌టించిన అనంత్ నాగ్ ఎవ‌రు..? ఆయ‌న పాత్ర‌ను ఎందుకు రీప్లేస్ చేశారో తెలుసా…!

KGFలో న‌టించిన అనంత్ నాగ్ ఎవ‌రు..? ఆయ‌న పాత్ర‌ను ఎందుకు రీప్లేస్ చేశారో తెలుసా…!

by AJAY
Ads

ప్రేక్ష‌కులు అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న కేజీఎఫ్ పార్ట్ 2 ట్రైల‌ర్ రానే వ‌చ్చింది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైల‌ర్ రికార్డుల‌ను కూడా కేజీఎఫ్ 2 బ‌ద్ద‌లు కొడుతోంది. కేజీఎఫ్ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ హీరోగా న‌టించారు. ఇక శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా న‌టించింది. అదే విధంగా రవీనాటండ‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించింది.

Advertisement

ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన కేజీఎఫ్ భారీ విజ‌యం సాధించ‌డంతో పార్ట్ 2 పై భారీ అంచ‌నాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆ అంచ‌నాల‌ను రీచ్ అయ్యేలా పార్ట్ 2 ట్రైల‌ర్ క‌నిపిస్తోంది. అయితే పార్ట్ 2 లో ప్ర‌కాష్ రాజ్ లేరు కానీ పార్ట్ 2 లో మాత్రం ప్ర‌కాష్ రాజ్ క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే పార్ట్ 1 లో ప్రకాష్ పాత్ర‌లో అనంత్ నాగ్ న‌టించారు.

Advertisement

అనంత్ నాగ్ క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో న‌టుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1973లో అనంత్ నాగ్ సంక‌ల్ప్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం అయ్యారు. అంతే కాకుండా ప్రేమ లేఖ‌లు సినిమాతో అనంత్ నాగ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు. అంతే కాకుండా అనంత్ నాగ్ హిందీ సినిమాల‌తో పాటూ సీరియ‌ల్స్ కూడా న‌టించారు. మ‌రోవైపు అనంత్ నాగ్ రాజ‌కీయాల్లోనూ రానించారు.

Advertisement

also read : 50 వెడ్స్ 25 వైర‌ల్ వెడ్డింగ్…5 నెల‌ల‌కే కాపురంలో ఊహించని విషాదం….!

ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా మ‌రియు మంత్రిగా ప్ర‌జ‌ల‌కు అనంత్ నాగ్ సేవ‌లు అందించారు. ఇదిలా ఉంటే అనంత్ నాగ్ పాత్ర‌ను ప్ర‌శాంత్ నీల్ ప్ర‌కాష్ రాజ్ తో రీప్లేస్ చేశార‌ని వార్త‌లు రాగానే ప్ర‌కాష్ రాజ్ ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌గలరా అని అనుకున్నారు. కానీ ప్ర‌కాష్ రాజ్ ను ట్రైల‌ర్ లో చూసిన త‌ర‌వాత ఆయ‌న కూడా అనంత్ నాగ్ రేంజ్ లో న‌టించార‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.