Home » తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఎన్టీఆర్ సినిమా తీసిన నటుడు పద్మనాభం ! చివరికేమైందంటే ?

తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఎన్టీఆర్ సినిమా తీసిన నటుడు పద్మనాభం ! చివరికేమైందంటే ?

by Anji
Ad

క‌మెడీయ‌న్ ముద్ర వేసుకున్నా హాస్య న‌ట‌న‌లో ఎంతో ప‌రిత‌పించిన న‌టుడు ప‌ద్మ‌నాభం. 1958లో ఆయ‌న స‌హ‌న‌టుడు వ‌ల్లం న‌ర్సింహ్మ‌రావుతో క‌లిసి రేఖ అండ్ ముర‌ళి ఆర్ట్స్ పేరుతో నాట‌క సంస్థ‌ను నెల‌కొల్పాడు. వీరి తొలి నాట‌కం శాంతి నివాసం. కాళ‌హ‌స్తి మ‌హాత్యం 300 ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. క‌మెడీయ‌న్ గా మంచి పేరు తెచ్చుకుని ఎన్టీఆర్‌, సావిత్రి ల ప్రోత్సాహంతో మంచి నిర్మాత‌గా మారారు ప‌ద్మ‌నాభం.

Also Read :  రాకేష్ పై సుజాత ఎమోష‌న‌ల్…అత‌డిని త‌లుకుని ఏడ్చేసిన ర‌ష్మి..!

Advertisement

రేఖా అండ్ ముర‌ళీ ఆర్ట్స్ ప‌తాకంపై 1964లో రూపుదిద్దుకున్న తొలి చిత్రం దేవ‌త‌. ప‌ద్మ‌నాభంకు సంగీత ద‌ర్శ‌కుడు ఎస్పీ కోదండ‌పాణి రూమ్‌మెట్‌. ఓసారి వేటూరి వీరిద్ద‌రికీ ఓ క‌థ చెప్పాడు. ప‌ద్మ‌నాభంకు ఆ క‌థ న‌చ్చింది. అందులో హీరోయిన్ పాత్ర డ‌బుల్ రోల్. నాటకానికి ప‌నికి రాదు. క‌చ్చితంగా సినిమా తీయాలి. ఈ క‌థ ఎవ‌రికైనా చెప్పండి.. నేను తీయ‌లేను క‌నుక ఎవ‌రూ తీసినా ఆనంద‌మే అని వేటూరితో ప‌ద్మ‌నాభం చెప్పాడు. అప్ప‌టికే రెండు నెల‌లు గ‌డిచింది. ప‌ద్మ‌నాభం ఆ క‌థ‌ను ఎప్పుడో మ‌రిచిపోయాడు. కానీ కోదండ‌పాణి ఆ క‌థ‌ను మ‌రిచిపోలేదు.


ఆ క‌థ బాగుంది. నువ్వే ధైర్యం చేసి సినిమా తీయ‌రాదు అని కోదండ‌పాణి ప‌ద్మ‌నాభంతో అన‌గా.. ఆలోచ‌న చేసి చివ‌ర‌కు ఓకే చెప్పాడు ప‌ద్మ‌నాభం. ఈ క‌థ‌కు ఎన్టీఆర్ హీరోగా బాగుంటార‌నుకొని వేటూరిని వెంట బెట్టుకుని ఓరోజు ఉద‌య‌మే ఎన్టీఆర్ నివాసానికి వెళ్లాడు ప‌ద్మ‌నాభం. త‌న స‌హ‌న‌టుడు నిర్మాత‌గా మారుతున్నార‌ని తెలియ‌గానే ఎన్టీఆర్ సంతోష‌ప‌డ్డాడు. ఈ క‌థ ఆయ‌న‌కు కూడా న‌చ్చింది. డేట్స్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ బ్ర‌ద‌ర్ అని చెప్పాడు. హీరోయిన్‌గా సావిత్రిని అనుకొని ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క‌థ ఆమెకు కూడా న‌చ్చింది. ప్ర‌తి సినిమాలో నాకు ఓ చ‌క్క‌ని పాత్ర ల‌భిస్తే ఇందులో రెండు ఉన్నాయ‌న్న మాట అని న‌వ్వుతూ చెప్పారు సావిత్రి. ఆ స‌మ‌యంలో ఆమె మూడు నెల‌ల గ‌ర్భ‌వ‌తి. గ‌ర్భంతో న‌టించ‌డం క‌ష్టం. డెలివ‌రీ అయ్యే వ‌ర‌కు ఆగుతారా అని సావిత్రి అడిగార‌ట‌. ఈ సినిమాను 3 నెల‌ల్లోనే పూర్తి చేస్తామ‌ని ప‌ద్మ‌నాభం చెప్పార‌ట‌.

Advertisement


అనుకున్న‌ట్టుగానే పూర్తి చేశారు. సావిత్రి అడ్వాన్స్ తీసుకుంటున్న సంద‌ర్భంలో ఓ 100 రూపాయ‌ల నోటు కింద ప‌డింద‌ట‌. అప్పుడు సావిత్రి ఆ నోటును తీసుకుని క‌ళ్ల‌కు అద్దుకుని ఇది మంచి శ‌కునం. మీ సినిమా 100 రోజులు ఆడుతుంద‌ని చెప్పింద‌ట‌. ఆమె చెప్పిన‌ట్టుగానే ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ సినిమాకు ప‌ద్మ‌నాభం దేవ‌త అనే టైటిల్ పెడ‌దామ‌నుకున్నారు. అయితే ద‌ర్శ‌క‌, నిర్మాత బీ.ఎన్‌.రెడ్డి చాలా రోజుల క్రిత‌మే ఓ సినిమా తీశారు. అందులో నాగ‌య్య హీరో. ఆ టైటిల్ కోసం ఆయ‌న‌ను ప‌ద్మ‌నాభం క‌లిశారు. అంద‌రూ అనుమ‌తి లేకుండానే టైటిల్స్‌ను పెడుతున్నారు. నామీద గౌర‌వంతో నువ్వు వ‌చ్చి అడుగుతున్నావు. క‌చ్చితంగా పెట్టుకో అని అనుమ‌తి ఇచ్చాడు బీ.ఎన్‌.రెడ్డి.


ద‌ర్శ‌కుడిగా కే. హేమాంబరధరరావు ను ఎన్నుకున్నారు. త‌న ఇంటిని 40వేల రూపాయ‌ల‌కు తాక‌ట్టు పెట్టి చిత్ర నిర్మాణ కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు ప‌ద్మ‌నాభం. ఇందులో త‌న పాత్ర‌కు సినిమా బ్యాక్ డ్రాప్‌ను ఎన్నుకున్నారు ప‌ద్మ‌నాభం. క‌థ‌లో భాగంగా వ‌చ్చిన ఆలోచ‌న ఇది. సినిమా స్టార్స్ ను చూడ‌డానికి జ‌నం ఎలా తంటాలు ప‌డుతారో ఈ సినిమాలో చూపించారు. ఎస్వీరంగారావు, గుమ్మ‌డి, రేలంగి, కాంతారావు, ర‌మ‌ణారెడ్డి, అంజ‌లిదేవి, షావుకారి జాన‌కి, జ‌మున వంటి స్టార్స్ ఇండ్ల వ‌ద్ద‌కు వెళ్లి ప‌ద్మ‌నాభం ఆటోగ్రాప్స్ తీసుకుంటాడు. 10 నిమిషాల నిడివి క‌లిగిన ఈ దృశ్యాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. 22 మంది ప్ర‌ముఖ తార‌లు పాల్గొన్న చిత్రం అని ప్ర‌చారం చేశారు.

ఈ చిత్ర నిర్మాణం స‌మ‌యంలోనే నాగ‌య్య‌కు ప‌ద్మ శ్రీ అవార్డు వ‌చ్చింది. ఈ చిత్రానికి కోదండ‌పాణి అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఇందులో ఎన్టీఆర్ క‌ళాశాల లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించారు. త‌ను ఎంతో ప్రేమించే భార్య సీత రైలు ప్ర‌మాదంలో మ‌ర‌ణించింద‌ని తెలియ‌గానే గుండె ప‌గిలే లా రోధిస్తాడు. ఈ సంద‌ర్భం కోసం నేప‌థ్య‌గీతం ఉంటే బాగుంటుంద‌ని ర‌చ‌యిత 20 రోజులు ప్ర‌య‌త్నించాడు. శ్రీ‌శ్రీ రెండు రోజుల్లో పాట రాసిచ్చాడ‌ట‌. ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచింది. మూడు రోజులు నైట్ వర్క్ చేశాడు. దాదాపు 12 గంట‌ల‌ వ‌ర‌కు ఎన్టీఆర్ వ‌ర్క్ చేశాడు. ఉద‌యం వేరే సినిమా షూటింగ్‌లో పాల్గొని నైట్ దేవ‌త షూటింగ్‌లో మూడు రోజులు వ‌ర్క్ చేశాడు. నిద్ర స‌రిపోక అప్పుడ‌ప్పుడు సెట్‌లో కునుకు తీశాడు. మొత్తానికి ఈ దేవత చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది.

Also Read :  50 వెడ్స్ 25 వైర‌ల్ వెడ్డింగ్…5 నెల‌ల‌కే కాపురంలో ఊహించని విషాదం….!

Visitors Are Also Reading