Home » ‘డుంకీ’ అంటే అర్ధం ఏంటో తెలుసా ? షారూఖ్ ఖాన్ ఏం చెప్పాడంటే..?

‘డుంకీ’ అంటే అర్ధం ఏంటో తెలుసా ? షారూఖ్ ఖాన్ ఏం చెప్పాడంటే..?

by Anji
Ad

దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, స్టార్ హీరో షారుక్ ఖాన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం డుంకీ ఈ సినిమా టైటిల్ క్యాచీగా ఉండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ టైటిల్ అర్థం ఏమిటనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అనే దానికి సమాధానం సినిమా చూస్తేనే దొరుకుతుంది. అయితే అంతకుముందే షారుక్ ఖాన్ డుంకీ అంటే ఏమిటో చెప్పాడు. ట్విట్టర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించిన షారుఖ్ ఖాన్ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

Advertisement

పంజాబ్ కు చెందిన కొంతమంది యువకులు ఇంగ్లాండ్ కు భారత సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించే కథాంశంతో తెరకెక్కిన చిత్రం డుంకీ ట్రైలర్ లోనే దానికి సంబంధించిన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము రేపింది. ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. డిసెంబర్ 21న డుంకీ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. అతనికి జోడిగా తాప్సీ పన్ను నటిస్తోంది. విక్కీ కౌశల్ మరో కీలక పాత్రలో నటించాడు. ఇంతమంది ఆర్టిస్టుల వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్ ని చూసిన అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ సినిమా చాలా క్లాస్ గా తీసినట్లు ట్రైలర్ చేస్తే అర్థమవుతుంది.

తాజాగా డుంకీ అంటే అర్థం ఏంటో చెప్పాడు షారుక్ ఖాన్.  అనుమతి లేకుండా దేశ సరిహద్దులు దాటడాన్ని గాడిద జర్నీ అంటారు. పంజాబీ యాసలో దాని డుంకీ అంటారు అని షారుక్ ఖాన్ అన్నారు.రాజ్ కుమార్ హిరానీ వర్క్ పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పీకే, సంజు, 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాల ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నాడు రాజ్ కుమార్ హిరానీ. ఇప్పుడు డుంకీ సినిమా ద్వారా ప్రేక్షకులకు కొత్త కథను చూపించేందుకు సిద్ధమయ్యాడు. డుంకీ సినిమా రిలీజ్ అయిన మరసటి రోజు డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ విడుదల కానుంది. కాబట్టి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading