Home » సిల్క్ స్మితకు దసరా మూవీకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

సిల్క్ స్మితకు దసరా మూవీకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి స్టార్ హీరోగా గుర్తింపు సాధించారు. త్వరలో దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ని ప్రేక్షకులకు అందించబోతున్నారు.

Advertisement

Also read:“సార్” సినిమా ఫ‌స్ట్ రివ్యూ…ఎలా ఉందంటే..?

వాలెంటెన్స్ డే సందర్భంగా బ్రేక్ అప్ సాంగ్ ని రిలీజ్ చేశారు. రిలీజ్ కార్యక్రమంలో సాంగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సాంగ్ చాలా స్లోగా అందరికీ ఎక్కేస్తుందని అన్నారు. తన ఫేవరెట్ సాంగ్స్ లో ఓరి వారి సాంగ్ ఒకటిగా ఉంటుందని లవ్ బ్రేకప్ అయిన ప్రతి ఒక్కరికి సాంగ్ చాలా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. బ్రేకప్ సాంగ్స్ లో ఇదొక ఆల్ టైం ఫేవరెట్ సాంగ్ గా మారుతుందని నాని అన్నారు. ఇదంతా పక్కన పెడితే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో నాని వెనుక సిల్క్ స్మిత పెయింటింగ్ ఉంటుంది.

Advertisement

రొ**టిక్ లుక్ లో సిల్క్ స్మిత లుక్ దసరా మూవీ పై హైప్ పెంచుతుంది అని చెప్పవచ్చు. అయితే ఈ పెయింటింగ్ పై నాని కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయట పెట్టారు.. డైరెక్టర్ శ్రీకాంత్ సిల్క్ స్మితకు పెద్ద అభిమాని అని పేర్కొన్నారు. అయితే అతను సిల్క్ స్మితాను అందరు చూసే కోణంలో కాకుండా దేవతలాగా ఆరాధించే అభిమానం ఉందని అన్నారు. ఈ కారణం వల్లే సిల్క్ స్మితను పోస్టర్లో పెట్టడం జరిగిందని తెలియజేశారు. నేను సిల్క్ స్మిత ఫ్యాన్ కాదని, శ్రీకాంత్ ఇష్ట ప్రకారం ఈ పోస్టర్ డిజైన్ చేయడం జరిగిందని నాని తెలియజేశారు.. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also read:Samantha : 600 మెట్లు ఎక్కి, ఆలయంలో మొక్కు తీర్చుకున్న సమంత…వీడియో వైరల్!

Visitors Are Also Reading