Home » “సార్” సినిమా ఫ‌స్ట్ రివ్యూ…ఎలా ఉందంటే..?

“సార్” సినిమా ఫ‌స్ట్ రివ్యూ…ఎలా ఉందంటే..?

by AJAY
Ad

త‌మిళహీరో ధ‌నుష్ డిఫ‌రెంట్ సినిమాల‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమాలు చేస్తూ ధ‌నుష్ త‌నదైన ముద్ర‌వేసుకున్నారు. అంతేకాకుండా ఎలాంటి పాత్ర‌లో అయినా ఒదిగిపోతూ న‌ట‌న‌తో మెప్పిస్తున్నాడు. బేసిక్ గా కోలీవుడ్ హీరో అయినా ధ‌నుష్ కు టాలీవుడ్ లో కూడా అభిమానుల‌ను ఉన్నారు. కోలీవుడ్ లో ధ‌నుష్ న‌టించిన చాలా సినిమాల‌ను ఫ్యాన్స్ కోసం తెలుగులో కూడా డ‌బ్ చేస్తున్నారు.

Advertisement

ర‌ఘువ‌రుణ్ బీటెక్ సినిమా త‌ర‌వాత ధ‌నుష్ క్రేజ్ టాలీవుడ్ లో మ‌రింత పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే ధ‌నుష్ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో సినిమా చేశాడు. సార్ అనే టైటిల్ తో తెర‌కెక్కిన ఈ సినిమా ఈనెల 17న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ధ‌నుష్ కు జోడీగా సంయుక్తమీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా నిడివి 2 గంట‌ల 17 నిమిషాలు ఉంది. కాగా తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ రివ్యూను సినిమా క్రిటిక్ ఉమైర్ సంధు సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

Advertisement

సినిమా ఎడిటింగ్ పూర్త‌య్యంద‌ని..ధ‌నుష్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడ‌ని ఉమైర్ త‌న ట్వీట్ లో పేర్కొన్నాడు. వైవిధ్యం చూపించే విష‌యంలో ధ‌నుష్ ముందువ‌రుస‌లో ఉంటాడ‌ని…ఇన్సైడ్ టాక్ బాగుంద‌ని తెలిపాడు.

ఇక ఉమైర్ ఇచ్చిన రివ్య్వూతో సినిమా పై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. అంతే కాకుండా ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ సినిమా క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని ఫ్యాన్స్ కూడా ధీమాతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూడాలంటే ఈ నెల 17 వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

ALSO READ : పెద్దమ్మాయి అమెరికన్ ని చేసుకుంది… చిన్నమ్మాయికి పెళ్లి వద్దన్నాను-జగపతిబాబు

Visitors Are Also Reading