Home » Samantha : 600 మెట్లు ఎక్కి, ఆలయంలో మొక్కు తీర్చుకున్న సమంత…వీడియో వైరల్!

Samantha : 600 మెట్లు ఎక్కి, ఆలయంలో మొక్కు తీర్చుకున్న సమంత…వీడియో వైరల్!

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తగ్గేదేలేదంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. సమంత శాకుంతలం, ఖుషి చిత్రాలలో నటిస్తోంది. ఇందుకోసం జిమ్ లో తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. తాజాగా జిమ్ లో సమంత చెమటోడ్చుతున్న వీడియోనూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. దీనితో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

మయోసైటిస్ కు సంబంధించి నెలవారి ఐవిఐజి సెషన్ కు హాజరైనట్లు తెలిపింది. ఇక తాజాగా సమంత మరోసారి వార్తలో నిలిచారు. తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోని పలని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ కింది నుంచి పై వరకు మెట్టు మెట్టుకు హారతి వెలిగించారు సమంత. అలా 600 మెట్లు ఎక్కారట సమంత.  అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పలని సుబ్రమణ్యస్వామికి సామ్ ప్రత్యేక పూజలు నిర్వహించిందని సమాచారం.

Advertisement

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు ఈ నెలలో రిలీజ్ కావాల్సిన సమంత పౌరాణిక చిత్రం శాకుంతలం 14కి వాయిదా పడింది.

READ ALSO : తారకరత్న కోసం బాలకృష్ణ కీలక నిర్ణయం!

Visitors Are Also Reading