ఇటీవలే నందమూరి తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. చిన్న వయస్సులోనే తారకరత్నకి ఇలా జరగడం చాలా బాధకరమైన విషయమనే చెప్పాలి. ఇక ఇది ఉంటే.. తారకరత్న సినీ కెరీర్ ప్రారంభంలో రెండు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను వదులుకున్నాడట. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఈశ్వర్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రం తొలుత తారకరత్న తో చేయాలనుకున్నారట. కానీ చివరి నిమిషంలో ఎందుకో ఈ ప్రాజెక్ట్ లో తారకరత్న స్థానంలో ప్రభాస్ వచ్చాడు.
Advertisement
అదేవిధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రం, రాఘవేంద్రరావు 100వ సినిమాగా తెరకెక్కిన ‘గంగోత్రి’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం కూడా తొలుత తారకరత్నతోనే చేయాలనుకున్నారట. కానీ అది కుదరలేదు. అలా అల్లు అర్జున్, ప్రభాస్ ప్రారంభ చిత్రాలను తారకరత్న మిస్ అయ్యాడు. ప్రారంభ చిత్రాలతోనే వీరిద్దరూ హిట్ కొట్టి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మారారు. ఈ రెండు సినిమాలను మిస్ చేసుకొని తన కెరీర్ లో సూపర్ హిట్స్ ని అందుకునే అవకాశాన్ని కోల్పోయాడు తారకరత్న.
Advertisement
ఒకటోనెంబర్ కుర్రాడు చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన నందమూరి తారకరత్న సినీ కెరీర్ అంతంత మాత్రంగానే కొనసాగింది. ప్రారంభంలో అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ రాను రాను కాస్త నిరాశ పరిచాడనే చెప్పాలి. ఇక విలన్ గా మాత్రం ప్రేక్షకులను మెప్పించాడు తారకరత్న. బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంలో తారకరత్నకి ఓ కీలక రోల్ ఇవ్వాలనుకున్నారట. ఇలా అవకాశాలు దొరికినప్పుడు సినిమాల్లో నటిస్తూనే.. ఇక పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనులోపే తారకరత్నకి ఇలా జరగడం చాలా బాధకరమనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్, ప్రభాస్ మొదటి చిత్రాలను తారకరత్న చేసి ఉంటే ఆయన లైఫ్ మరో విధంగా ఉండేది.
Also Read : రజినీకాంత్ ‘శివాజీ’ సినిమాలో దర్శకుడు శంకర్ చేసిన మిస్టేక్ ఇదే..!