Home » పోకిరి మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో మీకు తెలుసా ?

పోకిరి మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో మీకు తెలుసా ?

by Anji
Ad

సినీ పరిశ్రమను నమ్ముకొని స్వశక్తితో  ఎదిగిన అతి కొద్ది మంది దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు.  వాస్తవానికి  పోకిరి సినిమా స్క్రిప్ట్ ను ఆయన తన ఫస్ట్ మూవీ బద్రి సినిమా షూటింగ్ సమయంలోనే రాసుకున్నారట. అప్పటికీ ఆ ప్రాజెక్టుకు ఆయన పెట్టుకున్న పేరు ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సత్యనారాయణ. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వరుస విజయాల అనంతరం ఆంధ్రావాలా డిజాస్టర్ అయింది.  పూరి జగన్నాథ్ చిరంజీవితో శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ పేరుతో ఓ సినిమా ప్లాన్ చేశారు. చిరంజీవితో సినిమా అంటే ఆయన స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయడం, డేట్స్ ఇచ్చిన సినిమాలు పూర్తవ్వడం వంటి చాలా కారణాలతో కొంత ఆలస్యం అవుతుందని భావించారు. 

Advertisement

ఆ కారణంగా అప్పటికే తన వద్ద ఉన్న స్క్రిప్టుతో రవితేజ హీరోగా ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సత్యనారాయణ సినిమా చేద్దామనుకున్నారు పూరి.  ఆ ప్రాజెక్ట్ పేరు వినడంతోనే సినిమా చేద్దామన్నారు  రవితేజ. తమిళ సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చేసే అవకాశం రవితేజకి వచ్చింది. రవితేజకి అది ఇష్టమైన సబ్జెక్ట్, వదులుకుంటే ఎవరైనా చేసేస్తారని దాన్ని అంగీకరించారు. దాంతో పూరి ప్రాజెక్టు వాయిదా పడింది. రవితేజ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో పూరి జగన్నాథ్ ఈ స్క్రిప్ట్ ని అప్పటికి విలన్, సపోర్టింగ్ పాత్రలో చేస్తున్న సోనూసూద్ తో చేసేద్దామని అనుకున్నారు. సోనూసూద్ ని హీరోగా పరిచయం చేసి ఈ సినిమా చేయడం ప్రయోగాత్మకమే అయినా.. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం చేయడం కన్నా అదే  బెటర్ అని భావించారు. 

Advertisement

కొన్ని మార్కెట్ లెక్కలు కుదరకపోవడంతో సోనూసూద్ తో ఆ ఆలోచన వదులుకున్నారు. అలా చివరకి నవంబర్ 3, 2004న హైదరాబాద్ తాజ్ హోటల్లో మహేష్ బాబు కు పూరి కథ చెప్పారట. అప్పుడు చెప్పిన కథ ప్రకారం.. హీరో పాత్ర పేరు ఉత్తమ్ సింగ్ ఓ సిక్ఖుల కుర్రాడు. కానీ చివర్లో అతని తండ్రి సత్యనారాయణ అని అతనో పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. ఈ స్టోరీ మహేష్ బాబుకు బాగా నచ్చింది. తర్వాతి సంవత్సరం మొదలు పెట్టేద్దామని మహేష్ బాబు అంగీకరించేశారు. అప్పటివరకూ స్క్రిప్ట్ పేరును దాని నేపథ్యంలోనే ఉత్తమ్ సింగ్ సన్నా ఫ్ సత్యనారాయణ అని పెట్టారు. దాన్ని మార్చేయడంతో పూరీ సినిమాకి పోకిరి అన్న పేరు పెట్టారు.ఏప్రిల్ 28, 2006న పోకిరి సినిమా విడుదలైంది. సినిమా సంచలన విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభమైన 75 సంవత్సరంలో విడుదలైంది. సినిమా సాధించిన కలెక్షన్లు రూ.40 కోట్లు దాటడం 75 ఏళ్ల సినీ పరిశ్రమలో కొత్త రికార్డు గా నిలిచింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దేవర స్టోరీ లీక్..?

మురారి 2 ప్లానింగ్ లో కృష్ణవంశీ.. కుదిరేనా ?

 

Visitors Are Also Reading