Home » మురారి 2 ప్లానింగ్ లో కృష్ణవంశీ.. కుదిరేనా ?

మురారి 2 ప్లానింగ్ లో కృష్ణవంశీ.. కుదిరేనా ?

by Anji
Ad

మహేష్ కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ మురారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా టీవీలో వస్తే ప్రేక్షకులు కన్ను రెప్ప కొట్టకుండా ఎంతో ఆసక్తిగా ఈ మూవీని చూస్తుంటారు.   2001 లో విడుదలైన ఈ మూవీ మహేష్ ఖాతాలో  మంచి హిట్ ని అందుకుంది. 

Advertisement

ముఖ్యంగా మహేష్ బాబు ని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది మురారి  సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.   ఈ సినిమా సూపర్ హిట్ కాగా..  ఈ మధ్య కాలం కృష్ణవంశీ మురారి సీక్వెల్  తీసే ఆలోచనలో  ఉన్నట్టు  కూడా వార్తలు వినిపించాయి.  మురారి పార్ట్ 2 తీస్తే అందులో మహేష్ చేస్తాడా లేదా అన్నది  తెలియాల్సి ఉంది. ఒకవేళ అన్నీ కరెక్ట్ గా కుదిరితే మహేష్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. కానీ మురారి 2 లో మహేష్ కాకుండా మరో హీరోతో కృష్ణవంశీ ప్రయోగానికి రెడీ అయినట్టు సమాచారం. 

Advertisement

అయితే మురారి పార్ట్ 2 ని సూపర్ స్టార్  మహేష్ తో కాకుండా వేరే హీరోతో చేస్తే వర్క్ అవుట్ అవుతుందా.. కాదా అనే ఆలోచనతో ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారట. మురారి 2 తీస్తే మహేష్ తోనే చేయాలి అది కూడా కృష్ణవంశీ ఒక మంచి కథతో ఈ సినిమా తీయాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే మరో సినిమాలో బిజీ కానున్నాడు. దర్శకుడు కృష్ణవంశీ ఇటీవలే రంగ మార్తాండ మూవీ తీశాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మొత్తానికి మహేష్ బాబు-కృష్ణవంశీ కాంబోలో మురారి 2 మూవీ వస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. 

 మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

Adivi Sesh : నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి ?

జైపూర్ లో శర్వానంద్ వివాహం కోసం రోజుకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

 జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దేవర స్టోరీ లీక్..?

Visitors Are Also Reading