Home » జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దేవర స్టోరీ లీక్..?

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దేవర స్టోరీ లీక్..?

by Anji
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ అగ్ర దర్శకుడు  కొరటాల శివ దర్శకత్వంలో ఓ  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్దీ రోజుల క్రితమే ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ ను హైదరాబాద్ లోని పలు పరిసర ప్రాంతాలలో,  రామోజీ ఫిలిం సిటీ లో పూర్తి చేశారు. ఇక మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి దేవర అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో ఎన్టీఆర్ నల్లని దుస్తులు ధరించి, పొడవాటి కత్తి పట్టుకొని సేవలతో నిండి ఉన్న పడవలో ప్రయాణం చేస్తూ నిల్చుని ఉన్నాడు. ఈ పోస్టర్ తో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

అయితే ఈ సినిమా స్టోరీ కాస్త బయటికి వచ్చినట్లుగా తెలుస్తుంది. భయం అనేది తెలియకుండా బ్రతుకుతున్న అడవి మృగాలకు అతడిని చూస్తే వనుకు పడుతుంది అనే లైన్ మీద ఈ సినిమాను తీస్తున్నాను అని కొరటాల ఈ సినిమా ముహూర్తం రోజే చెప్పారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో స్టోరీ బయటికి లీక్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సముద్ర తీరాన స్మగ్లర్ గా పని చేస్తూ ఉంటాడు. అతనితో పోటీగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇదే వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య మొదటి నుంచి కొన్ని గొడవలు ఉంటాయి. ఒకానొక  సమయంలో సముద్ర నడిబొడ్డున స్మగ్లింగ్ గూడ్స్ తో ప్రయాణిస్తున్న ఎన్టీఆర్ గ్యాంగ్ ని సైఫ్ అలీ ఖాన్ చంపేస్తాడు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దేవర కొడుకు అంటే మరో ఎన్టీఆర్ వాళ్ళ రాజ్యంలోకి దిగుతాడు.చివరికి ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అనేది మిగతా స్టోరీ. దీంతో ఈ సినిమా స్టోరీ కామన్ గా అనిపిస్తుంది. 

Advertisement

ఇలాంటి స్టోరీ చిన్నప్పటి నుంచి మనం చాలానే చూస్తూ వస్తున్నాం.  మళ్ళీ అలాంటి స్టోరీ తోనే సినిమా రావడం పెద్ద సాహసమే. కొరటాల ఈ సినిమాను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తీయకపోతే ఆయన గత సినిమా ఆచార్య  మాదిరిగా ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అవ్వడం పక్కా.. కానీ కొరటాల శివ పై అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న కొరటాల ఈ సినిమాను కరెక్ట్ గా తీస్తాడని అందరూ అనుకుంటున్నారు. అసలు ఆచార్య సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఎన్టీఆర్ ఈ సినిమాను చేస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.  కొరటాల ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో వేచి చూడాలి మరి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Rajamouli : ఆ హీరోతో ఈ జన్మలో సినిమా చేయను – రాజమౌళి

 WTC ఫైనల్‌ కి ముందు భారత జట్టుకు భారీ షాక్‌.. గాయపడిన ఆ స్టార్‌ ఆల్‌రౌండర్‌..!

 

Visitors Are Also Reading