Home » బాల‌కృష్ణ ‘భగవంత్ కేసరి’ మూవీకి ఫ‌స్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?

బాల‌కృష్ణ ‘భగవంత్ కేసరి’ మూవీకి ఫ‌స్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమధ్య కాలంలో బాలయ్య వరుస హిట్ సినిమాలు తీస్తూ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. తాజాగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీ సూపర్ హిట్ సాధించింది. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తాజా మూవీ భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గార్లపాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.

Bhagavanth Kesari Review

Advertisement

యంగ్ హీరోయిన్ శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ కేసరి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. థియేటర్ల వద్ద విజయదుందుబి మోగిస్తుంది. ఇప్పటికే విడదలైన అన్ని చోట్లా ఎక్సలెంట్ వసూళ్లను అందుకుంటోంది. దీంతో చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ దావత్ పేరుతో సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించారు.

Advertisement


ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన ప్రొడ్యూసర్ దిల్ రాజు.. భగవంత్ కేసరికి అనిల్ రావిపూడి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో రివీల్ చేసారు. ఈ సినిమాకి ఫస్ట్ “ఐ డోంట్ కేర్” అని టైటిల్ పెడుతున్నట్టు అనిల్ తనతో చెప్పాడని.. కొత్తగా ఉందని తాను అన్నానని.. కానీ ఆ తరువాత బాలకృష్ణ క్యారెక్టర్ గా తగ్గట్టు టైటిల్ ను భగవంత్ కేసరిగా పెట్టి.. ఐడోంట్ కేర్ ను ట్యాగ్ లైన్ గా మార్చారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. దీంతో ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల  కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్  కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading