సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఎన్టీఆర్. ఆ సందర్భంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నన్నెంతో ప్రభావితం చేశారని పేర్కొన్నారు. ఓసారి ఎన్టీఆర్ వచ్చినప్పుడు చూడటానికి వెళ్తే.. కొంతమంది నన్ను ఎత్తుకొని చూపించారని పేర్కొన్నారు. నాకు 13 ఏళ్ల వయస్సులో లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్ గారిని చూశాను.
Also Read : సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?
Advertisement
. “నేను చూసిన ఫస్ట్ సినిమా పాతాళ భైరవి. అందులో హీరో ఎన్టీఆర్. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి. అదేవిధంగా నాకు నచ్చిన సినిమా కూడా పాతాళ భైరవి అని చెప్పుకొచ్చారు. మరో విశేషమేంటంటే.. నేను హీరోగా చేసిన ఫస్ట్ మూవీ పేరు కూడా బైరవినే. ముఖ్యంగా నాకు 18 ఏళ్లప్పుడు స్టేజ్ పై ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేశాను. ఆ తర్వాత 1977లో ఆ మహానుభావుడితోనే కలిసి టైగర్ సినిమా చేశాను. దానవీర శూరకర్ణ ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు.. ఎన్టీఆర్‌ది ఎంతో గొప్ప వ్యక్తిత్వం” అని పేర్కొన్నారు. అప్పట్లో దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ సంచలనం సృష్టించారు.. మహామహులను ధీటుగా ఎదుర్కొన్నారు. అదేవిధంగా బాలకృష్ణ కూడా తనకు మంచి మిత్రుడు అని, కంటి చూపుతోనే చంపేస్తాడు. బాలకృష్ణ చేసే ఫీట్లు అమీర్ ఖాన్, అమితాబ్, రజినీకాంత్ చేసినా జనం ఒప్పుకోరని తెలిపారు సూపర్ స్టార్ రజినీకాంత్.
Advertisement
Also Read : చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం
రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య రజినీ కాంత్ దర్శకత్వం వహించబోతున్న ‘లాల్ సలామ్’ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం. ఈ సినిమాలో సూపర్ స్టార్ ఓ అతిథి పాత్రను పోషించనున్నట్టు టాక్. అనంతరం ఈ ఏడాది చివర్లో రజినీకాంత్, డైరెక్టర్ జ్ఞానవేల్ తీయబోయే చిత్రంపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా టైటిల్ ను ‘తలైవర్ 170’గా అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ షూటింగ్ మాత్రం 2024 రెండవ త్రైమాసికంలో ముగుస్తుందని మేకర్స్ వెల్లడించారు.
Also Read : ఎన్నికల ముందు జగన్ మరో అస్త్రం..మే 9న “జగనన్నకు చెబుదాం”