Telugu News » ఉపాసనని రామ్ చరణ్ పెళ్లి చేసుకోవడానికి తాత ప్రతాప్ రెడ్డి పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ?

ఉపాసనని రామ్ చరణ్ పెళ్లి చేసుకోవడానికి తాత ప్రతాప్ రెడ్డి పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన  చిరుత సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్.. మగధీర,  రంగస్థలం వంటి సినిమాలతో స్టార్ హీరోగా మారాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.  ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కపుల్స్ ఉన్నా అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన జంట.

Ramcharan and upasana

Advertisement

తన చిన్ననాటి స్నేహితురాలు అయినా ఉపాసన కొణిదెలను రామ్ చరణ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012 జూలై 14న రామ్ చరణ్ కామినేని ఉపాసనని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అప్పట్లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దోమకొండ కోటలో కోట్ల ఖర్చుతో వీరి పెళ్లి ఘనంగా నిర్వహించారు. అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాసనని పెళ్లి చేసుకోవడానికి ఆమె తాత ప్రతాపరెడ్డి రామ్ చరణ్ కి ఓ క్రేజీ కండిషన్ పెట్టారట.

Advertisement

అదేంటంటే.. ఎంతోమంది పెద్దింటి పిల్లలు పెళ్లి కాగానే ఇంటి కోడలిని కేవలం ఇంటికే పరిమితం చేస్తారని వాళ్లు చేయాలనుకున్న పనులు చేయనివ్వరని చాలా సినీ ఫ్యామిలీస్ లో ఈ విషయాలను నేను చూశాను. కానీ మా ఉపాసన మాత్రం పెళ్లి తర్వాత కూడా ఇండిపెండెంట్ గా బ్రతకాలని అనుకుంటుంది. ఆమె ఏం చేయాలనుకున్న పూర్తి ఫ్రీడమ్ ఆమెకు మీరే ఇవ్వాలి. దీనికి ఒప్పుకుంటేనే పెళ్లికి ఒప్పుకుంటాం అంటూ చిరంజీవి, రామ్ చరణ్ కి కండిషన్ పెట్టారంట ప్రతాప్ రెడ్డి. ఆయన మాటల్లో న్యాయం ఉండడంతో మెగా కుటుంబం కూడా ఒప్పుకున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

యూట్యూబర్ తో రిలేషన్ లో ఉన్న నిహారిక .. ఆపోస్ట్ తో క్లారిటీ..!

పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున చేసిన త్యాగం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading