Home » అఖిల్ తరువాత మూవీకి బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా ?

అఖిల్ తరువాత మూవీకి బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా ?

by Anji
Ad

అక్కినేని అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ  ఏజెంట్.  గత కొద్ది రోజుల కిందట విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా తగ్గాయి. 

Also Read :  పవన్ కళ్యాణ్‌ సినిమాపై పూనమ్ ఫైర్.. భగత్‌ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్

Advertisement

ఇక ఏజెంట్ సినిమా డిజాస్టర్ టాక్ రావడంతో అనిల్ సుంకర ఈ విషయంపై స్పందిస్తూ.. బౌండేడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేయడం వల్లనే ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయిందంటూ ట్విట్టర్ లో స్పందించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏజెంట్ సినిమా ప్లాప్ ప్రభావం అందరికన్నా ఎక్కువగా హీరో అఖిల్ పైనే పడింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ రాత్రి, పగలు చాలా కష్టపడ్డాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి మీద నమ్మకంతో  ఏది చేయమంటే అదే చేశాడు అఖిల్. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో అఖిల్ ఢీలా పడిపోయాడు.అఖిల్ స్టార్  దర్శకులను నమ్ముకొని ప్రతిసారి మోసపోతూ వస్తున్న తరుణంలో ఈసారి అఖిల్ ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. 

Advertisement

Also Read :  యాదాద్రి ఆలయ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సిస్టర్..!

Manam News

రాధే శ్యామ్, సాహో సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ తో అఖిల్ కోలాబీరేట్ అవ్వబోతున్నారు. యూవీ  క్రియేషన్స్ ఈ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ సమాచారం ప్రకారం సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారంట. ధీర అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్ల వరకు  బడ్జెట్ ఖర్చు చేయనున్నట్టు సమాచారం.  ఇప్పటికే ఏజెంట్ సినిమాకి రూ.80 కోట్ల వరకు పెట్టి మినిమమ్ వసూళ్లు కూడా రాకపోయిన మళ్లీ అఖిల్ ని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టడం ఆశ్చర్య పోవాల్సిన విషయమే అని చెప్పాలి. అఖిల్ ని నమ్మి ఇంత పెట్టుబడి పెడుతున్న యూవీకి అఖిల్ హిట్ ఇస్తాడో లేదో వేచి  చూడాలి మరి. 

Also Read :   Ustaad Bhagatsingh: “ఉస్తాద్” ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందిరోయ్.. పవన్ ఫ్యాన్స్ కు ఇక జాతరే

Visitors Are Also Reading