Home » పవన్ కళ్యాణ్‌ సినిమాపై పూనమ్ ఫైర్.. భగత్‌ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్

పవన్ కళ్యాణ్‌ సినిమాపై పూనమ్ ఫైర్.. భగత్‌ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్

by Bunty
Published: Last Updated on
Ad

నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ… తరచు ఏదో ఒక అప్డేట్ తో కానీ స్టిల్ తో కానీ నెటిజన్లను పలకరిస్తూ ఉంటుంది. తన వ్యక్తిగత జీవితంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, తన పేరు దెబ్బతిందని ఇప్పటికే చెప్పుకొచ్చిన విషయం విధితమే. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.

Read also : సీఎం పదవి అడుగుతా.. పొత్తులపై పవన్‌ కళ్యాణ్ సంచలన ప్రకటన

Advertisement

‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ విడుదలకు కొన్ని గంటల ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ ఒక కానుక ఇచ్చారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద ఉస్తాద్ భగత్ సింగ్ పేరు పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. ఇది కచ్చితంగా భగత్ సింగ్ కించపరచడమేనని, భగత్ సింగ్ యూనియన్ కు దీన్ని రిపోర్ట్ చేయండని ట్విట్ చేసింది.

READ ALSO : Shakuntalam : ఒకరోజు ముందే ఓటిటిలోకి వచ్చేసిన “శాకుంతలం”… ఎందులో స్ట్రీమింగ్ అంటే!

Poonam Kaur Fires on Pawan Kalyan Ustaad Bhagat Singh Poster | పవన్ కళ్యాణ్‌ సినిమాపై పూనమ్ కౌర్‌ ఫైర్.. భగత్‌ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్ News in Telugu

దీంతో పవన్ ఫ్యాన్స్ నీకేం పని పాట లేదా? మధ్యలో ఎందుకు దూరుతున్నావని ఫైర్ అయ్యారు. తాజాగా పూనమ్ కౌర్ మరో ట్విట్ చేసింది. ‘స్వాతంత్ర సమరయోధులను గౌరవించకపోయినప్పటికీ కనీస మర్యాద ఇవ్వాలి. అంతేకానీ ఇలా కించపరచకూడదు. సినిమా పోస్టర్లో ఆయన పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా? ఇది అహంకారమా? లేక అజ్ఞానమా?’ అని మండిపడింది. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ కాంట్రవర్సీలు క్రియేట్ చేసి వార్తల్లో ఉందామనుకుంటున్నావా? అని మండిపడుతున్నారు.

READ ALSO : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..పాక్ లో ఇంటర్నెట్, సోషల్ మీడియా “బ్లాక్”

Visitors Are Also Reading