కొంత మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. మరికొంత మందికి అయితే టీ తాగనిది వారికి రోజు గడవనే గడవదు. టీతోనే నిద్ర లేస్తారు. టీ తాగి పడుకుంటారు. ఇక చాలా మంది తమ ఆఫీసుల్లో పని ఒత్తిడికి గురైనప్పుడు తప్పకుండా టీని సేవిస్తుంటారు. కొంత మంది టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదంటే.. మరికొందరూ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి అని అంటున్నారు. టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీలో లభించే కాటేచిన్ లు విన్స్, థియారుబిగిన్స్ వంటి సమ్మేళనాలు అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు క్యాన్సర్ నిరోధక అలాగే కార్డియో ప్రొటెక్టివ్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. వేడి వేడి టీ తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గాలనుకుంటే టీ మాత్రం చాలా మంచిది. టీ లో ఉండే ఫ్లేవనాయిడ్లు మీ జీవప్రక్రియ ను పెంచడమే కాకుండా కొవ్వును కూడా కరిగిస్తుంది. గ్రీన్ లేదా బ్లాక్ టీలో ఉండే సూక్ష్మ పోషకాలు మీ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతాయి.
Advertisement
Advertisement
ఈ పానియాల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తోంది. గ్రీన్‌టీలో ఉండే ముఖ్యమైన కాటేచిన్ క్యాన్సర్ పోరాట లక్షణాలను కలిగి ఉంది. న్యూరోలాజికల్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అతిసారం, మలబద్ధకం, అల్సర్ లు, కడుపునొప్పితో బాధపడేవారు తరచుగా హెర్బల్ టీ లను తీసుకోవడం మంచిది. ఎందుకంటే టీలోని టానిన్లు పేగు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు గుండెకు చాలా మంచిది. దీని ద్వారా గుండె పోటు రక్తం గడ్డ కట్టడం, స్ట్రోక్ తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
Also Read :
సంసారానికి పనికి రాడని తెలిసి పెళ్లి..! న్యాయం చేయాలని బాధితురాలు నిరసన
పెళ్లి వేదికపై కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!