Home » తీన్మార్ మల్లన్న సినిమాల్లో నటించాడనే విషయం మీకు తెలుసా ?

తీన్మార్ మల్లన్న సినిమాల్లో నటించాడనే విషయం మీకు తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

తీన్మార్ మల్లన్న ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అంతేకాదు.. తీన్మార్ మల్లన్న ఒక సినిమాలో నటించాడట. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మరి నిజంగానే తీన్మార్ మల్లన్న సినిమాలో నటించాడా? ఆయనకు ఈ టాలెంట్ కూడా ఉందా? ఇంతకీ ఏంటా సినిమా? అన్న వివరాల్లోకి వెళితే.. తీన్మార్ మల్లన్న నటించిన ఒక సినిమాలోని సీన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివంగత నటుడు వేణుమాధవ్ తో కలిసి తీన్మార్ మల్లన్న చేసిన కామెడీ సీన్లు అవి. సినిమా పాతది అయినా తాజాగా కొంత మంది ఆ సినిమాలోని సీన్లను యూట్యూబ్, ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Advertisement

ఈ సీన్లు చూసిన నెటిజన్లు ఏంటి మల్లన్న సినిమాలో నటించాడా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, తీన్మార్ మల్లన్న నటించిన ఏకైక సినిమా ఇది. సినిమా పేరు శ్రీమతి బంగారం. 2016లో వచ్చింది ఈ కామెడీ సినిమా. రాజీవ్ కనకాల, రిచర్డ్ రిషి, రిచా సిన్హా, తీన్మార్ మల్లన్న, వేణుమాధవ్, హేమ ప్రధాన పాత్రలు పోషించారు. ఎం.వినయ్ బాబు ఈ సినిమాకు దశకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా ఒకటి టాలీవుడ్ లో వచ్చినట్లు చాలామందికి తెలియదు. కాబట్టి ఇందులో తీన్మార్ మల్లన్న నటించారన్న సంగతి ఎవరికీ తెలుస్తుంది. అందుకే ఈ విషయం మరుగున పడిపోయింది.

కానీ ఈ వీడియోని బయటికి తీయడంతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ విషయం కాస్త చాలామందికి తెలిసింది. ఈ సినిమాలో వేణుమాధవ్, తీన్మార్ మల్లన్న స్నేహితులుగా నటించారు. వీరిద్దరూ కార్మికులు. వేణుమాధవ్ కు హేమ భార్యగా నటించారు. తాగుబోతు భర్త అయిన వేణుమాధవ్ ను భద్రకాళిలా భార్య హేమ క్రమశిక్షణలో పెడుతుంది. అలాంటి వాడికి మల్లన్న స్నేహితుడు. ఇద్దరు కలిసి తాగుతుంటారు. ఈ క్రమంలో కామెడీ పండించారు. అయితే సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న సినిమా సీన్స్ చూసి నేటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పొలిటికల్ గా ఆయన్ని వ్యతిరేకించేవారు అయితే ఎగతాళి చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading