Home » “బాహుబలి” సినిమాలో దీనిని గమనించారా? ఇదేమిటో, ఎలా పని చేస్తుందో తెలుసా?

“బాహుబలి” సినిమాలో దీనిని గమనించారా? ఇదేమిటో, ఎలా పని చేస్తుందో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా “బాహుబలి”. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్, రానాలకు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ స్టార్ డమ్ లభించింది. ఇక ఈ సినిమా కూడా అద్భుతంగా ఉంది. ఎన్నో విషయాలు ఇప్పటికీ ఈ సినిమా గురించి బయటకు వస్తున్నా.. ఇంకా ఈ సినిమా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటూనే ఉన్నాయి.  బాహుబలి సినిమాలో యుద్ధానికి సంబంధించిన సీన్లు హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాలో యుద్ధం ఏ లెవెల్ లో గూస్ బంప్స్ ఇస్తుందో చెప్పక్కర్లేదు. అయితే.. ఈ యుద్ధంలో రాజమౌళి ఉపయోగించిన ఆయుధాలు, పరికరాలు అన్నీ మనకి కొత్తవే. వాటిని మనం ఎప్పుడూ చూడలేదు. అయితే ఇప్పుడు మనం బాహుబలి లోని ఓ యుద్ధ పరికరం గురించి చెప్పుకోబోతున్నాము.

catapult 1

Advertisement

శత్రువుల మీదకు భారీ గుండ్లను వదిలేందుకు వాడిన ఈ యుద్ధ పరికరాన్ని కాటాపుల్ట్ అని పిలుస్తారు. బాహుబలి సినిమాలో వీటి ఎంట్రీ హైలైట్ గా నిలిచింది. అప్పటివరకు యుద్ధం కేవలం కత్తులు, కటార్లతోనే సాగింది. కాటాపుల్ట్ ఎంట్రీ తో యుద్ధం కీలక మలుపు తీసుకుంటుంది. చరిత్రలో ఈ పరికరం సాయంతోనే మగధ రాజు అజాతశత్రు లిచ్చావీ రాజ్యాన్ని తేలికగా ఓడించాడు. అప్పటివరకు పాశ్చాత్య దేశాలకే సొంతమైన ఈ పరికరాన్ని ఇండియాకి కూడా తీసుకొచ్చారు.

Advertisement

catapult

ఉండేలు కాన్సెప్ట్ తో తయారైన ఈ పరికరం ద్వారా బండ రాళ్లను శత్రువులపైకి విసిరేస్తారు. తరువాత పేలుడు పదార్ధాలను కూడా విసిరేసేవారు. ఫిరంగులు వచ్చిన తరువాత వీటి వాడకం తగ్గించేశారు. ఇందులో మనుషులను కూర్చోపెట్టి సరదాగా నీళ్ళలోకి విసిరేయడం లాంటివి కూడా కొంతకాలం చేసారు. కానీ, దూరాన్ని అంచనా వేయలేక కొందరు మనుషులు చనిపోవడంతో ఈ సరదాని మానేశారు. యుద్ధకాలం రోజుల్లో ప్రాచుర్యం పొందిన కాటాపుల్ట్ తిరిగి బాహుబలి సినిమాలో మనకి కనిపించింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

“ఛత్రపతి” కంటే ముందే ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో మిస్ అయిన ఈ సినిమా ఏదో తెలుసా?

 Pawan Kalyan: పవన్ కళ్యాణ్, ఆర్జీవీ కాంబో లో సినిమా మిస్ అయ్యిందా? ఆ సినిమా ఏంటంటే?

Bhagavanth Kesari: బాలయ్య “భగవంత్ కేసరి” నుంచి కొత్త లీక్.. వైరల్ అవుతున్న ఫోటో!

Visitors Are Also Reading