టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఎంత క్రేజీ ఉందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కేవలం దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతగా, రచయితగా, నటుడిగా కూడా పూరి జగన్నాథ్ కి మంచి పేరు ఉంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో పూరి నటన అద్భుతం అనే చెప్పవచ్చు. 2000 లో వచ్చిన పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో పూరి జగన్నాథ్ దర్శకునిగా పరిచయమయ్యారు.
Advertisement
ఆ తర్వాత బాచి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడీయట్ వంటి చాలా సినిమాలు తీసినప్పటికీ మహేష్ బాబుతో పోకిరి సినిమాతో ఒకసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని మార్చేసి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్. ఇప్పటి వరకు తెలుగులో 33కు పైగా సినిమాలు చేశారు. కన్నడలో ఒక సినిమాకి దర్శకత్వం వహించారు. చివరగా విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ సినిమాని తెరకెక్కించి భారీ డిజాస్టర్ ని చవిచూశారు. దీంతో తన తదుపరిచిత్రం జనగణమన సినిమా కూడా వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది.ఈ మధ్యకాలంలో ఎక్కువ పరాజయాలు పొందుతున్న డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమాలన్నీ నిరాశని మిగులుస్తున్నాయి.
Advertisement
Also Read : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఒకానొక దశలో సినిమాలు నిర్మించడం వల్ల రోడ్డున పడ్డ పూరి జగన్నాథ్ ఆ తర్వాత తిరిగి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి తన మార్క్ ను చేరుకున్నాడు. లైగర్ సినిమాతో ప్రస్తుతం కష్టాల పాలయ్యారు పూరి. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రాం శంకర్ ఇప్పుడు హీరోగా పలు సినిమాల్లో నటిస్తుంటాడు. బయటి ప్రపంచానికి తెలియని మరో తమ్ముడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అతని పేరు పెట్ల ఉమా శంకర్ గణేష్. ప్రస్తుతం వైఎస్ ఆర్సీపీ తరుపున నర్సిపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తన తమ్ముడు ఒక ఎమ్మెల్యే అని పూరి జగన్నాథ్ ఎప్పుడూ కూడా ఎక్కడ తెలియజేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.
Also Read : ఎన్టీఆర్ సినిమాలో జరిగినట్టే.. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ అలా ఎలా మరణించాడు..!