Home » మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ సినిమాలు ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ సినిమాలు ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగాన్ని వదిలేసి సినిమాల వైపు వచ్చాడు. అభిమానుల కోరిక మేరకు బాస్ ఈస్ బ్యాక్ అంటూ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో చిరంజీవికి గత వైభవం ఉంటుందా అన్న అనేక అనుమానాల మధ్య వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఉత్సాహంతోనే వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయారు చిరు.

chiranjeevi-flop-movies

Advertisement

 

మధ్యలో సైరా నరసింహారెడ్డి భారీ దెబ్బ కొట్టింది. చరణ్ కు దాదాపు రూ.30 కోట్లు నష్టం తెచ్చిపెట్టిందట. అందుకే చిరు సినిమాల సంఖ్యను డబల్ చేశారు. సైరాకు వచ్చిన నష్టాలను ఆచార్య రూపంలో లాభాలుగా మార్చుకోవాలని చాలా ప్లాన్డ్ గా చేసిన కూడా అతి దారుణంగా పరాజయం పాలైంది.

Also Read : బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు అదే రేంజ్ లో హిట్ అందుకున్న రాజశేఖర్ సినిమా ఇదే..!

Manam

వరస విజయాల దర్శకుడు కొరటాల శివ కూడా అపజయాన్ని మూటగట్టుకున్నాడు. పైగా రామ్ చరణ్ ను సినిమాలో పెట్టుకొని కూడా ఫ్లాప్ కొట్టడం చిరు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎన్నో భారీ అంచనాల నడుమ వచ్చి ఆచార్య బాక్సాఫీస్ వద్ద గోరంగా దెబ్బ తిన్నాడు. పైగా మెగాస్టార్ కెరీర్ లోనే భారీ ఫ్లాప్ చిత్రంగా మిగిలిపోయింది ఆచార్య. అసలు ఇప్పటివరకు మెగాస్టార్ సినీ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలిన చిత్రాలు ఏమిటో తెలుసుకుందాం. 2004లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన సాధ్యలో ఎమ్మెస్ ఆర్ట్ మూవీస్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం అంజి చిరుకి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. పైగా చిరంజీవి సరసన ఈ చిత్రంలో మహేష్ బాబు సతీమణి నమ్రత సిరోత్కార్ నటించడం విశేషం.

Also Read : ఎన్టీఆర్ సినిమాలో జరిగినట్టే.. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ అలా ఎలా మరణించాడు..!

Advertisement

Manam

భారీ అంచనాలను తారుమారు చేసి భారీ పరాజయాన్ని చవిచూసింది ఈ చిత్రం. శంకర్ దాదా జిందాబాద్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ కి రీమేక్ గా వచ్చింది ఈ సినిమా. ప్రేక్షకుల ఆదరణ అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది. మృగరాజు : హాలీవుడ్ చిత్రం ది గోస్ట్ అండ్ ది డార్క్ నెస్ సినిమాకి రీమేక్ ఈ చిత్రం. కాగా ఈ చిత్రం చిరు కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వసుల పరంగా కూడా మొదటి రోజే చతికిల పడింది. బిగ్ బాస్: బిగ్ బాస్ అంటే రియాలిటీ షో కాదండి. మెగాస్టార్ గతంలో చేసిన ఓ సినిమా. పేరులో ఉన్న గొప్పతనం సినిమాలో లేక ఈ సినిమా కూడా భారీ పరాజయాన్ని చవిచూసింది.SP పరశురాం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1994లో విడుదలైన ఈ చిత్రం కూడా భారీ ఫ్లాప్ అయ్యింది. ఫస్ట్ మెగాస్టార్ శ్రీదేవి కలిసి నటించిన ఫ్లాప్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.

Manam

స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, మెగాస్టార్ విజయశాంతి కాంబోలో వచ్చిన ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అలాగే మరికొన్ని సినిమాలు చూద్దాం. చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు, రాజా విక్రమార్క, యుద్ధభూమి సినిమాలు కూడా ఫ్లాప్ చిత్రాలుగా మిగిలిపోయాయి. అదేవిధంగా మోహన్ బాబు, చిరంజీవి కలిసి నటించిన చక్రవర్తి సినిమా కూడా ఆ రోజుల్లో నిర్మాతకు భారీ కష్టాలను మిగిల్చింది. ఈ కోవాలోనే ఆరాధన, త్రినేత్రుడు, కిరాతకుడు, జేబుదొంగ, రుద్రనేత్ర, చాణక్య శపథం, వేట, చిరంజీవి, ధైర్యవంతుడు, శివుడు శివుడు శివుడు, హీరో వంటి చిత్రాలు కూడా నష్టాల వలయంలో చిక్కుకొని బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిల పడ్డాయి. పైగా ఇప్పుడు చెప్పుకున్న చిత్రాలన్నీ మెగాస్టార్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.

Also Read : YASHODA MOVIE REVIEW : యశోద ఎలా ఉందంటే ?

 

Visitors Are Also Reading