Home » ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రానికి తారకరత్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రానికి తారకరత్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

by Anji
Ad

నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  తారక రామారావు సినిమాలు, రాజకీయాలలో రాణించి.. తెలుగు నాట ఆయన ఇంటి పేరు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా  నిలిచిపోయేలా చేశారు. ఎన్టీఆర్ వారసులు సినిమాలు, రాజకీయాల్లో రాణించారు. వారిలో ఎన్టీఆర్ వారసుడు నందమూరి మోహన కృష్ణ తనయుడు, నందమూరి తారకరత్న ఒకరు. అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ.. కలుపుగోలుగా ఉంటూ తిరిగే వ్యక్తి ఇవాళ తమ మధ్య లేడనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తారకరత్న పెద్దకర్మ కార్యక్రమం కూడా ముగిసిపోయింది.  

Also Read :  బాబోయ్ లడ్డు బాబుల మారిన సుధీర్ బాబు… ఫోటో చూశారా?

Advertisement

1983లో జనవరి 08న నందమూరి మోహన కృష్ణ, సీత దంపతులకు చెన్నైలో జన్మించారు తారకరత్న. మోహనకృష్ణ ఎన్టీఆర్ నిర్మించినటువంటి కొన్ని సినిమాలకు కెమెరామెన్ గా పని చేశారు. ఈ దంపతులకు తారకరత్న ఒక్కరే సంతానం. చెన్నైలో 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కి వచ్చేయడంతో నందమూరి కుటుంబం ఇక్కడికి షిప్ట్ అయింది. తారకరత్న జూబ్లీహిల్స్ లోని భారతీయ విద్యాభవన్ హై స్కూల్ విద్య, గుంటూరు విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. బైకు రైడింగ్, స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లడం తారక్ కి అలవాటు. ఆ తరువాత హైదరాబాద్ లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. 

Advertisement

Also Read  :   మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి… సూపర్ టైటిల్ పెట్టారుగా!

తన బాబాయ్ బాలకృష్ణ మాదిరిగానే హీరో కావాలనుకున్నారు తారకరత్న. ఇదే మాటను బాబాయ్ తో చెప్పేసారు. బాలయ్య చొరువ తీసుకొని తారకరత్నను హీరోగా పరిచయం చేశారు. తారక్ ఇంజినీరింగ్ చేస్తున్న 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పట్లో ఒకేరోజు 9 సినిమాలు అనౌన్స్ చేసి చరిత్ర సృష్టించారు తారకరత్న. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాకు తారకరత్న తీసుకున్న రెమ్యునరేషన్ గురించి  ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేయగా.. శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ నిర్మించారు. తారకరత్న ఇంట్రడక్షన్ సినిమా కాబట్టి కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాలనుకున్నాం. అందుకే తారకరత్న రెమ్యునరేషన్ తగ్గించాలని భావించినట్టు అశ్వినిదత్ తెలిపారు. అన్ని ఖర్చులకు కలిపి తారకరత్నకు రూ.10లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు నిర్మాత అశ్వినిదత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

Also Read :  మోహన్ బాబు, విష్ణు లేకుండానే మంచు మనోజ్ పెళ్లి..?

Visitors Are Also Reading