Home » వాల్తేరు వీరయ్య టైటిల్ ఎలా వచ్చిందో తెలుసా ?

వాల్తేరు వీరయ్య టైటిల్ ఎలా వచ్చిందో తెలుసా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటిస్తొన్న చిత్రం వాల్తేరు వీరయ్య. దర్శకుడు బాబీ(కే.ఎస్. రవీంద్ర) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇందులో మెగాస్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఆల్బమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ సూపర్ హిట్ గా నిలిచాయి. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

waltair-verayya-review

Advertisement

ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిరంజీవికి ఫ్యాన్ గా 2003లో నా జర్నీ ప్రారంభమైంది. చిరంజీవి సినిమాలో పని చేయాలనే ఓ కల ఉండేది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకే తాను దర్శకత్వం వహించిన చిత్రం వాల్తేరు వీరయ్య సినిమా 2023లో విడుదలవుతుంది. జీవితంలో ఇది మరిచిపోలేని మూవ్ మెంట్ అని చెప్పుకొచ్చారు. చిరంజీవి, రవితేజ ఎవరి సపోర్టు లేకుండా ఎలా వచ్చారో..? తాను కూడా ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. వారిద్దరితో కలిసి ఈ సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు. వాస్తవానికి ఈ సినిమా కథను కరోనా కంటే ముందు ఒక ఫ్యాన్ బాయ్ గానే చిరంజీవి గారికి చెప్పాను. లాక్ డౌన్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు. అందరినీ అలరించే కథ చెప్పాలని ప్రత్యేకంగా  దృష్టి పెట్టాము. దాంట్లో నుంచి వచ్చిన క్యారెక్టరే రవితేజది. ఫ్యాన్ బాయ్ గా ప్రారంభించి ఓ డైరెక్టర్ గా ఇద్దరి పాత్రలను బ్యాలెన్స్ గా డిజైన్ చేశాను. చివరి వరకు కథే గొప్పగా కనిపిస్తుంది. 

Advertisement

Also Read :  ఈ స్టార్ దర్శకులు.. ఒకప్పుడు అసిస్టెంట్ దర్శకులుగా పని చేశారనే విషయం తెలుసా ?

 

బీ, సీ సెంటర్ ఆడియన్స్ తో పాటు మల్టిప్లెక్స్ ప్రేక్షకులను కూడా అలరించే గుణాలు కనిపిస్తాయి. ఈ చిత్రంలో ప్రతీ సీన్ లో ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఎమోషన్స్ కూడా ఉంటాయి.ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ… వెంకి మామ షూటింగ్ లో యాగంటిలో జరుగుతున్నప్పుడు నాజర్ ఓ పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీమ్ కి చెప్పాను. చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్లలో ఉన్నప్పుడు చిరంజీవి గారి నాన్నగారు దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ రూ.500 ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోలో వల్లనే మద్రాస్ వచ్చానని చిరంజీవి చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్యనే. చాలా నోస్టాలిజిక్ గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య అనే పెడితే బాగుంటుందనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చడంతో వాల్తేరు వీరయ్య లాక్ చేశామని తెలిపారు దర్శకుడు బాబీ. 

Also Read :   ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ట్రైలర్‌..అన్నయ్య వస్తే పూనకాలు, అడుగేస్తే అరాచకాలు

Visitors Are Also Reading