Home » జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి ఇంద్రజ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి ఇంద్రజ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రస్తుతం మన బుల్లితెర క్వీన్ గా మారింది ఇంద్రజ. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది. అయితే కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ కి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తూ వస్తుంది.

Advertisement

సినిమాలకు పూర్తిగా దూరమైనటువంటి ఇంద్రజ కేవలం షోలకు మాత్రమే పరిమితమైంది. కొన్ని సినిమాలలో నటించినప్పటికీ చిన్నచిన్న పాత్రలలో నటిస్తూ మెప్పిస్తోంది. అయితే జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరించినందుకు ఇంద్రజ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందని విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంద్రజ జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి 2.5 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇంద్రజతో పాటు కృష్ణ భగవాన్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇతనికి కూడా 2.5 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరికి ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువ.

Advertisement

ఒకప్పుడు జబర్దస్త్ జడ్జీలుగా రోజా, నాగబాబు వ్యవహరించేవారు. వారు ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకునేవారట. వారితో పోల్చుకుంటే వీరికి చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇక ఇంద్రజ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ డబ్బులను సంపాదిస్తుంది. కానీ సినిమాలలో నటిస్తే వచ్చే రెమ్యూనరేషన్ తో పోలిస్తే జబర్దస్త్ లో వచ్చే రెమ్యునరేషన్ ఎక్కువ. అందుకే ఇంద్రజ సినిమాలలో కన్నా బుల్లితెర షోలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

రాహుల్‌ ద్రావిడ్ కు బిగ్‌ షాక్‌..కోచ్‌ పదవి నుంచి ఔట్‌ ?

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

Visitors Are Also Reading