Home » విరూపాక్ష సినిమాతో సుకుమార్ కి లాభం ఎంత వచ్చిందో తెలుసా ?

విరూపాక్ష సినిమాతో సుకుమార్ కి లాభం ఎంత వచ్చిందో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో సుకుమార్ పేరు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యులు చేసే ఏ సినిమాకైనా సమర్పకుడిగా లేదా సహ నిర్మాతగా వ్యవహరించాడు. అందుకోసం ఆయన పెడుతున్న ఖర్చు పెద్దగా ఏమి లేదు. కానీ లాభాలలో మాత్రం కొంత వాటాను దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. 

Also Read :  అబ్దుల్: సాయి ధరంతేజ్ ని కాపాడినందుకే ఉద్యోగం పోయింది..ఎంత టార్చర్ అంటే..!!

Advertisement

తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష సినిమాతో సుకుమార్ కి భారీగానే దక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు కార్తీక్ వర్మ దండు గతంలో సుకుమార్ వద్ద పలు సినిమాలకు వర్క్ చేశాడు. ఈ మధ్య కాలంలో సుకుమార్ కి ఈ కథ వినిపించడంతో నచ్చి మెగా హీరోతో చేసే అవకాశాన్ని కుదిరిచ్చినట్టుగా సమాచారం. అలా ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ భాగస్వామ్యం అయ్యాడట. అంతేకానీ సుకుమార్ పెద్దగా ఖర్చు చేసింది ఏమి లేదు. 

Advertisement

తన సమయాన్ని కూడా కేటాయించింది లేదట. సినిమాకి సంబంధించి చిన్న సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవాడట. అందుకోసం విరూపాక్ష సినిమాకి దాదాపు రూ.5కోట్ల రూపాయలు లాభాన్ని సుకుమార్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. రూపాయి పెట్టుబడి పెట్టకుండా తన పేరును బ్రాండ్ గా ఉపయోగించుకుంటూ సుకుమార్ సంపాదిస్తున్న తీరు చూస్తే.. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో సినిమాల విషయానికి వస్తే.. పుష్ప సూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ పుష్పను రూపొందించే పనిలో ఉన్నాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Also Read :  రంగమార్తండ మూవీలోని బ్రహ్మనందం పాత్ర గురించి పరుచూరి ఏమన్నారో తెలుసా ? 

Visitors Are Also Reading