Home » రంగమార్తండ మూవీలోని బ్రహ్మనందం పాత్ర గురించి పరుచూరి ఏమన్నారో తెలుసా ? 

రంగమార్తండ మూవీలోని బ్రహ్మనందం పాత్ర గురించి పరుచూరి ఏమన్నారో తెలుసా ? 

by Anji
Ad

దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఆయన తెరకెక్కించే చిత్రాలలో సమాజానికి మెస్సెజ్ ఇచ్చే ప్రయత్నం తప్పక చేస్తుంటారు. ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రంగమార్తండ. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మనందం వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి పరుచూరి గోపాల కృష్ణ  రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రంగమార్తండ సినిమాలో బ్రహ్మనందం గురించి కీలక విషయాన్ని ప్రస్తావించారు. సినిమా చూసిన తరువాత బ్రహ్మనందానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించినట్టు వెల్లడించారు. 

Also Read :  Prabhas తండ్రి ప్రొడ్యూజ్ చేసిన 6 సినిమాలు…అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లే!!

Advertisement

దాదాపు 1250 సినిమాలు, ఎన్నో అవార్డులను అందుకున్న బ్రహ్మనందంలో ఓ అద్భుతమైన నటుడిని రంగమార్తాండలో చూసినట్టు తెలిపారు పరుచూరి గోపాలకృష్ణ. నిల్చొని, కూర్చొని డైలాగ్ లు ఎవరైనా చెబుతారు. కానీ ఈ మూవీలో బ్రహ్మనందం బెడ్ పై ఉండి కూడా పౌరాణిక డైలాగ్ లు అద్భుతంగా చెప్పారని ప్రశంసించారు. అలా చెప్పడం గొప్ప నటులకు మాత్రమే తప్ప మిగిలిన వారికి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎవరైనా రంగమార్తాండ మూవీ చూడకపోతే బ్రహ్మనందం కోసం అయినా చూడాలని కోరారు. సినిమాలో బ్రహ్మనందం నటన చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. 

Advertisement

Also Read :  అబ్దుల్: సాయి ధరంతేజ్ ని కాపాడినందుకే ఉద్యోగం పోయింది..ఎంత టార్చర్ అంటే..!!

ప్రధానంగా అద్భుతమైన రంగస్థల నటుడు స్నేహితుడి వల్ల చనిపోవడం నచ్చలేదని.. సినిమాలోని ఆ ఒక్క సన్నివేశం పై పరుచూరి నిరాశ వ్యక్తం చేశారు. తనకు తెలిసిన వారిలో కొందరూ స్టేజీ పై డైలాగ్ చెబుతూ ప్రాణాలను విడిచిన వారు ఉన్నారని తెలిపారు. రంగమార్తాండ క్లైమాక్స్ లో బ్రహ్మానందం సన్నివేశాలలో కొంచెం మార్పు చేసి ఉంటే ఇంకా బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీని బ్రహ్మనందం, ప్రకాశ్ రాజ్ నటనతో పాటు.. మంచి జీవితం ఉందని చెప్పారు. సినిమాలోని ప్రతీ పాత్రలో జీవం ఉందన్నారు. కచ్చితంగా అందరూ ఈ మూవీ చూసి బ్రహ్మానందాన్ని ఆశీర్వదించాలని కోరారు. ప్రేక్షకులను నవ్వించడం కోసం ఎన్నో వేషాలు వేసిన బ్రహ్మనందం ఈ మూవీలో తనలోని నటనను బయటికీ తీశారని పేర్కొన్నారు. సజీవమైన నటనకు అద్దమే ఈ మూవీ అని బ్రహ్మనందం నటపై పరుచూరి ప్రశంసలు కురిపించారు. 

Also Read  :  సీనియ‌ర్ ఎన్టీఆర్ కు వ్య‌తిరేకంగా కృష్ణ చేసిన 5 సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading