ప్రముఖ హాస్య నటుడు సీ.కే.నగేష్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానమే సంపాదించుకున్నాడు_. ఈయనకు దక్షిణాది చాప్లిన్ గా పేరువచ్చింది. అభిమానులు ఈయనను వెండితెరపై చూస్తే చాలు ఆనందపడేవారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్లాసిక్ చిత్రాలు చేసిన నగేష్ అసలు పేరు గుండూరావు. కానీ అభిమానులకు గుండూరావు అంటే సరిగ్గా తెలియదు. నగేష్ అనే పేరు చెబితేనే గుర్తు పడతారు. ఇక ఆ నగేష్‌కి సీనియర్ ఎన్టీఆర్ చేసిన సాయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కర్నాటక రాష్ట్రానికి చెందిన నగేష్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలు అంటే ఆసక్తి ఉండేది. ఆయనకు సినిమాలపై ఉన్న ఆసక్తితోనే మద్రాస్‌కి వెళ్లారట. ఇక అక్కడ భారతీయ రైల్వేలో కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. ఇక ఆ తరువాత రంగస్థల నటుడి అవతారం ఎత్తి చక్కని పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత గొప్ప హాస్య నటుడిగా ప్రఖ్యాతి గాంచారు నగేష్. అతని జీవితంలో ఓ ఘటన వల్ల ఆయన లైఫ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అటువంటి సమయంలో ఎన్టీఆర్ ఆయనకు చేసిన సాయం వల్లనే నగేష్ లైఫ్ మరో విధంగా మారింది.
Advertisement
Advertisement
రంగ స్థలం నుంచి వచ్చిన నగేష్‌కు చాలా ధైర్యముండేది. స్వయంగా కష్టపడి పైకి వచ్చిన తాను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని అనుకునేవాడు. ఈ నేపథ్యంలో ఓ చిత్ర షూటింగ్ లో తమిళ స్టార్ హీరో ఎంజీఆర్ సెట్ కు వచ్చినప్పుడు లేచి నిలబడలేదు. దీంతో ఆయనకు కోపం వచ్చింది. నగేష్‌కి అవకాశాలు ఇవ్వవద్దని ఆయనకు చెప్పారట. దీంతో నగేష్‌కి ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదట. అప్పట్లో ఎంజీఆర్ మాటలను ఎదురించి అవకాశాలు ఇచ్చే సాహసం ఎవ్వరూ చేయలేదు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నగేష్‌కి మద్దతు ఇచ్చారు. తెలుగులో వరుస సినిమాలు అవకాశాలు ఇప్పించారు. ఎన్టీఆర్ చేసిన సాయం ఎప్పుడూ గుర్తుంచుకుంటానని నగేష్ పలు సందర్భాల్లో అన్నారట. నగేష్‌కి అవకాశాలు ఇస్తున్నారని తెలుసుకున్న ఎంజీఆర్ కూడా నగేష్ పై ఉన్న కోపాన్ని వదులుకున్నారట.
Also Read :
బాలకృష్ణ,చిరంజీవి పారితోషికంపై సంచలన విషయాలు బయటపెట్టిన గీతాకృష్ణ..!!
ప్రభాస్ వేసుకున్న టీ షర్టుకు ఇంత స్పెషల్ ఉందా.. అభిమానులు వెతకడానికి కారణం ఇదేనా..?