Home » ప్రభాస్ వేసుకున్న టీ షర్టుకు ఇంత స్పెషల్ ఉందా.. అభిమానులు వెతకడానికి కారణం ఇదేనా..?

ప్రభాస్ వేసుకున్న టీ షర్టుకు ఇంత స్పెషల్ ఉందా.. అభిమానులు వెతకడానికి కారణం ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఒక పాపులర్ హీరో అయిపోయారు. బాహుబలి సినిమా ద్వారా దేశం దాటి ప్రపంచ దేశాలకు ప్రభాస్ అంటే ఏంటో చాటిచెప్పారు. అలాంటి ప్రభాస్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఏ చిన్న పని చేసినా అభిమానులంతా ఫాలో అయిపోతారు. ఆయన మీడియా ముందుకు వచ్చారు అంటే ఆ క్రేజే వేరు.. అయితే ప్రభాస్ పెద్దగా ఫ్యాషన్ ను పట్టించుకోరు. బట్టల పై కూడా ఎక్కువ దృష్టి పెట్టరని తెలుస్తోంది.

Advertisement

ఆయన వేసుకున్న దుస్తులు లేదంటే ఏదైనా వస్తువులపై ఫ్యాన్స్ మాత్రం చాలా దృష్టి పెడతారు. ఆయన ఏది వేసుకొని వచ్చినా దాని గురించి ఆరా తీస్తుంటారు. తాజాగా సీతా రామం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ప్రభాస్ కూడా వచ్చారు.. అయితే ఆ సినిమా సంగతి పక్కన పెడితే డార్లింగ్ కోసం ఫ్యాన్స్ ఎగబడి పోయారు. ఇక ఇందులో అభిమానులను ఆకట్టుకున్న విషయం ఏంటంటే ఆయన వేసుకున్న టీ షర్ట్. ఇప్పుడు ఆ టీ షర్టు ఏ కంపెనీ ఎంతకు దొరుకుతుంది అనే విషయంపై వెతుకులాట మొదలైంది. ప్రభాస్ వేసుకున్నటువంటి బ్లాక్ టీ షర్ట్ డోల్స్&గబ్బనా వారు డిజైన్ చేసింది. దీని ధర ఇంచుమించు 20 వేల వరకు ఉంటుందట. అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది.

Advertisement

సరిగ్గా అయిదు సంవత్సరాల క్రితం ప్రభాస్ ఒక ఈవెంట్ కి వచ్చినప్పుడు ఇలాంటి టీ షర్ట్ వేసుకొని వచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ కు ఇలాంటి టీషర్ట్లు ఒక స్పెషల్ అని అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఈవెంట్లకు వచ్చినప్పుడు మాత్రమే వేసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ టీ షర్ట్ కోసం ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ వెతకడం మొదలుపెట్టారు. అయితే ఈవెంట్ కి వచ్చిన ప్రభాస్ మాట్లాడిన మాటలు కూడా అందరినీ మెస్మరైజ్ చేశాయి. ఇంట్లో పూజా మందిరం ఉందని మనం దేవాలయానికి వెళ్ళడం మానేస్తామా.. థియేటర్ కూడా ఒక గుడి లాంటిదే అని సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్లండి అంటూ ఫ్యాన్స్ కి హితవు పలికారు. అయితే ఈ సినిమాకు హను రాఘవపూడి డైరెక్టర్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా, సుమంత్ నటిస్తున్నారు.

ALSO READ;

Visitors Are Also Reading