Home » బాలకృష్ణ సిన్సియర్ గా ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారా..?

బాలకృష్ణ సిన్సియర్ గా ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు బాలకృష్ణ. ఆయన మంగమ్మగారి మనవడు అనే మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ కొడుకు గా స్టార్ హోదా ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో బాలకృష్ణ కూడా ఒకడిగా ఉన్నాడు. మాస్ హీరోగా ఫ్యాక్షన్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసుకున్నారు .

Advertisement

అలాంటి బాలకృష్ణకు తన తండ్రి అన్నా,అభిమానులన్నా చాలా గౌరవం ఇస్తారు. కానీ బాలకృష్ణ పెళ్లి కాకముందు ఒక హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలారట.అప్పట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఓ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడట. చెన్నైకి చెందిన ఆ హీరోయిన్ ని విపరీతంగా ప్రేమించానని తన సన్నిహితులకు చెప్పేవాడట బాలయ్య. అప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నా ఎన్టీఆర్, హరికృష్ణ కు ఈ విషయం తెలియడంతో కాకినాడలో తన బంధువుల అమ్మాయి అయినా వసుంధర ని ఇచ్చి బాలకృష్ణ కు వివాహం చేశారట.

Advertisement

కానీ బాలకృష్ణ ఆ హీరోయిన్ ను ప్రేమించడం మాత్రం నిజమేనని నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఒకానొక ఇంటర్వ్యూలో తెలియజేశారు. కానీ తండ్రి మాటకు విలువ ఇచ్చి తను లవ్ చేసిన అమ్మాయిని వదులుకున్నారని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్ బీకే 105 నటిస్తున్నారు. ఇందులో కథానాయికగా శృతిహాసన్ నటిస్తున్నారు.

ALSO READ;

Visitors Are Also Reading