యాంకర్ సుమ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చలాకైన మాటలతో అలరించే సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు ఓ సినిమా కూడా చేసిన విషయం విధితమే. టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలా ఎన్నో చేస్తున్నారు సుమ. బుల్లి తెరపై ఆమె ఒక మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా సరే ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టుకుంటారు.
Advertisement
సుమ పుట్టింది మలయాళంలో అయినా తెలుగింటి కోడలై మాటలతో మైమరిపిస్తున్నారు. సుమ ఒక్క షోకి ఎంత వసూలు చేస్తుంటారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. తెలుగులో పాపులర్ యాంకరే కాదు.. టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఆమె హోస్ట్ చేయాల్సిందే. సుమ ఒక్క షో ఈవెంట్‌కి దాదాపు రూ.2 నుంచి 2.5 లక్షల వరకు వసూలు చేస్తుంటారని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందిన 47 ఏళ్ల స్టార్ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలతో సూపర్ బిజీగా ఉన్నారు. ఇక యూట్యూబ్ ద్వారా కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
Also Read : మిస్సమ్మ సినిమాను మిస్ చేసుకున్న అలనాటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ముఖ్యంగా యాంకర్ సుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీగానే సంపాదిస్తుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. సుమ ఛానల్ కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి. సుమ ఛానల్ వ్యూస్ కంటే ఎక్కువ మంది చూసే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కానీ సుమ యూట్యూబ్ ఛానల్‌కి అత్యధిక రెవెన్యూ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. యాంకర్ సుమ కార్యక్రమాలు ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న వారు చూస్తున్నారట. అమెరికా, ఇతర దేశాల్లో ఉన్న వారు యూట్యూబ్ ద్వారా సుమ కార్యక్రమాలను చూడడంతో సుమకు ఆదాయం అత్యధికంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సుమ యూట్యూబ్ ద్వారా నెలకు రెండున్నర లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వచ్చినా కూడా కాస్త ఎక్కువగానే కష్టపడుతుందనే చెప్పాలి.
Also Read : తగ్గేదే లే అంటున్న వెన్నెల కిషోర్.. ఎంత రెమ్యూనరేషన్ అంటే..!!