Home » తగ్గేదే లే అంటున్న వెన్నెల కిషోర్.. ఎంత రెమ్యూనరేషన్ అంటే..!!

తగ్గేదే లే అంటున్న వెన్నెల కిషోర్.. ఎంత రెమ్యూనరేషన్ అంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చాలా న్యాచురల్ గా కామెడీ చేసే కమెడియన్స్ లో వెన్నెల కిషోర్ ముందు వరుసలో ఉంటారు.. టాప్ లో ఎంత మంది కమెడియన్స్ ఉన్నా కానీ ఈయన కామెడీ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది.. ఈతరం కమెడియన్స్ లో వెన్నెల కిషోర్ బెస్ట్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఒకానొక సమయంలో బ్రహ్మానందం, ఆలీ కమెడియన్స్ గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. వేలాది సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Advertisement

also read:“గాఢ్ ఫాద‌ర్” ఫ‌స్ట్ రివ్య్వూ వ‌చ్చేసింది..! మ‌రో గ‌బ్బ‌ర్ సింగ్ అవుతుందా..?

ప్రస్తుతం వీరికి వయసు పెరిగిపోవడంతో కాస్త సినిమాలకు దూరమైపోయారు. ఈ తరుణంలోనే తెలుగు ఇండస్ట్రీ లోకి యంగ్ జనరేషన్ కమెడియన్స్ అరంగేట్రం చేశారు. ఇందులో వెన్నెల కిషోర్ చాలా స్పెషల్. ప్రతి ఒక్క స్టార్ హీరో, ఇతర యంగ్ హీరోల ఏ సినిమా వచ్చిన వెన్నెల కిషోర్ కామెడీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. కమెడియన్ గా అంత బిజీ అయిపోయారు ఆయన. ఇంతటి పేరు సంపాదించుకున్న వెన్నెల కిషోర్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారు అనేది చాలా మందికి తెలియదు.

Advertisement

ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. వెన్నెల కిషోర్ ఏదైనా సినిమా కమిట్ అయ్యే ముందే పారితోషకం పిక్స్ చేసుకుంటారని, ఇది కేవలం సినిమాలో నటించినందుకు మాత్రమేనని ఇక ప్రమోషన్ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే దానికి వేరే పారితోషికం తీసుకుంటారని దానికోసం ముందుగానే అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంటారని తెలుస్తోంది. ఆయన సినిమాల్లో చేసినందుకుగాను రెండు రోజులు ఉచితంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ అగ్రిమెంట్ సినిమా చేసే ముందే రాసుకుంటారు అని టాక్. ఏది ఏమైనా వెన్నెల కిషోర్ ఒక కాల్ షీట్ కు ఆరు లక్షల వరకూ తీసుకుంటారని సమాచారం.

also read:

Visitors Are Also Reading