Home » మిస్సమ్మ సినిమాను మిస్ చేసుకున్న అలనాటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మిస్సమ్మ సినిమాను మిస్ చేసుకున్న అలనాటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో మిస్సమ్మ సినిమా అంటే తెలియని వారు ఉండరు. ఎల్ వి ప్రసాద్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, సావిత్రి,ఎస్వీ రంగారావు, రేలంగి, గుమ్మడి, అల్లు రామలింగయ్య ఇంతమంది స్టార్ మాటలు నటించారు. ఈ మూవీ 1955 జనవరి 12 న రిలీజ్ అయింది. ఈ సినిమాతో సావిత్రికి చాలా మంచి పేరు వచ్చింది. నిజం చెప్పాలంటే ఇందులో సావిత్రి క్యారెక్టర్ కు ముందుగా భానుమతిని తీసుకున్నారట.

 

also read:Astrology: తినే ఆహారంలో వెంట్రుకలు వస్తున్నాయా..అయితే మీ జాతకంలో అది ఉన్నట్టే..?

Advertisement

ఆమెతో నాలుగు రోజులు షూట్ చేసిన తర్వాత ఆవిడ ఏదో వ్రతం పేరు చెప్పి చాలా లేటుగా షూటింగ్ రావడంతో ప్రొడ్యూసర్ బి.నాగిరెడ్డి కి కోపం వచ్చి ఆవిడను తీసేసి సావిత్రి మిస్సమ్మగా పెట్టారట. అప్పట్లోనే ఈ సినిమాను తెలుగు, తమిళ వెర్షన్ లో షూట్ చేసారు. తమిళ్ లో ఎన్టీరామారావు క్యారెక్టర్ కు బదులుగా జెమినీ గణేషన్ చేశారు. ఇది తమిళ్ లో కూడా సూపర్హిట్ అయింది. అలాగే ఇదే సినిమాని 1957 లో ఏవియం ప్రొడక్షన్స్ వారు మిస్సమ్మ డైరెక్టర్ ఎల్.వి.ప్రసాద్ హిందీలో మిస్ మేరీ గా మీనా కుమారి ని పెట్టి తీశారు.

Advertisement

ఇందులో స్పెషాలిటీ ఏంటంటే తెలుగు, తమిళం హిందీ భాషలలో జమున క్యారెక్టర్ జమున చేయడం కొసమెరుపు. అక్కడ కూడా ఇది మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు అప్పట్లో ఎన్టీ రామారావు గారికి 75 రూపాయల పారితోషికం ఇచ్చారట. సావిత్రి కి 70 రూపాయలు, రేలంగి 55, జమునకు 45, అక్కినేని నాగేశ్వర రావు గారికి 35 రూపాయలు ఇచ్చారట. కానీ ఇందులో అత్యంత తక్కువ పారితోషకం తీసుకున్నది అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు. ఏదిఏమైనా అప్పట్లో మిస్సమ్మ సినిమా మూడు భాషల్లో సంచలన విజయాన్ని అందుకునీ చరిత్ర సృష్టించింది.

also read:చిరంజీవి శ్రీదేవిలు చేతులారా వ‌దులుకున్న‌ బ్యూటిఫుల్ ప్రేమ‌క‌థా చిత్రం ఏదో తెలుసా..? ఎలా మిస్స‌య్యిందంటే..?

Visitors Are Also Reading