Home » పంజాబీ పెళ్లిలో బ్యాడ్ ప్లే చేసిన బ్రిటీషర్లు.. ఎక్కడో తెలుసా ?

పంజాబీ పెళ్లిలో బ్యాడ్ ప్లే చేసిన బ్రిటీషర్లు.. ఎక్కడో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా భారతీయ సాంప్రదాయాలలో పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న సాంప్రదాయాలుంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా వారి సంప్రదానికి తగినట్టు పెళ్లి వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకుంటారు.ముఖ్యంగా భారతీయులు ఎక్కడ ఉన్నా సరే తమ సంప్రదాయం మాత్రం మరిచిపోరని పలు సందర్భాల్లోనే రుజువు చేస్తూనే ఉన్నారు. 

Advertisement

ముఖ్యంగా భారతీయుల పెళ్లి అంటే సంబురం మామూలుగా ఉండదు. బ్యాడ్ బాజాలతో, డీజే సౌండ్స్ త బరాత్ దద్దరిల్లిపోవాల్సిందే. భారత్ లో ఇది సర్వసాధారణం. కానీ లండన్ లో మాత్రం ఇలా జరిగితే చాలా వెరైటీ అనే చెప్పాలి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. లండన్ లో ఓ పంజాబీ కుటుంబంలో పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పెళ్లికొడుకుని ఊరేగిస్తూ బారాత్ తీశారు.  

Also Read :  రాత్రిపూట ఈ ఆహారపదార్థాలను నానబెట్టి తింటే ఈ వ్యాధులన్నీ దూరం..!

ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ పెళ్లిలో బ్రిటీషర్లు బ్యాండ్ వాయించారు. అంతేకాదు.. పెళ్లికొడుకు గుర్రంపై కూర్చొని ఉండగా.. ఆ గుర్రాన్ని హ్యాండిల్ చేసింది కూడా బ్రిటిష్ కి చెందిన వ్యక్తినే కావడం విశేషం. నేత్రపర్వంగా సాగిన ఈ బారాత్ వీడియోను కంప్లీట్ సర్కిల్ వెల్త్ మేనేజింగ్ పార్ట్ నర్, సీఐఓ గుర్మిత్ చద్దా ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు. పంజాబీ వెడ్డింగ్ కి బ్యాండ్ వాయించినటువంటి ఆంగ్లేయులు.. మనోళ్ల క్లాసిక్ రివేంజ్.. అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే లక్ష మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోను లైక్ చేస్తూ.. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా పంజాబీలు ప్రపంచాన్ని పరిపాలిస్తారు అని కామెంట్ చేశాడు. ఇక నెటిజన్లు ఎవరికీ నచ్చినట్టు వారు తమదైన శైలీలో పలు కామెంట్స్ చేయడం విశేషం. 

Also Read :  ప్రాణ స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading