Home » 15 రోజుల్లో బలగం చిత్రం ద్వారా దిల్ రాజు ఎంత సంపాదించాడో తెలుసా?

15 రోజుల్లో బలగం చిత్రం ద్వారా దిల్ రాజు ఎంత సంపాదించాడో తెలుసా?

by Anji
Published: Last Updated on
Ad

 ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మించిన ‘ బలగం ‘ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.  కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమైన వేణు.. జబర్దస్త్ షోలో తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా వేణు బలగం సినిమాని  తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హీరోగా ప్రియదర్శన్, హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. చాలా సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ గా నటించిన ప్రియదర్శి ఈ  చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

Also Read :  చైతూ రెండో పెళ్లిని ఆవిడే అడ్డుకుంటున్నారా..? అక్కినేని ఫ్యామిలీలో అస‌లేం జ‌రుగుతోంది..!

Advertisement

ఈ సినిమా మార్చి 03, 2023న థియేటర్లలో విడుదల అయింది. విడుదలైన మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక హీరో ప్రియదర్శన్ కి కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ప్రపంచ స్థాయిలో 15 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. నైజాం ఏరియాలో 15 రోజుల్లో బలగం సినిమా దాదాపు రూ.9 కోట్లకు పైగా  కలెక్షన్ లు సాధించింది. ఆంధ్ర, సీడెడ్ ఏరియాలలో ఐదు కోట్ల కలెక్షన్లు దక్కాయి. 

Advertisement

Also Read :  మోహ‌న్ బాబు బ‌ర్త్ డే వేడుక‌లో సంద‌డి చేసిన మ‌నోజ్ దంప‌తులు…క‌నిపించని మంచు విష్ణు..!

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. అదేవిధంగా ఈ చిత్రానికి  కేరళ, ఓవర్సీస్ లో కలుపుకొని 35 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. బలగం సినిమా భారీ కలెక్షన్స్ సాధించడంతో సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు మరోసారి సక్సెస్ నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు ఉన్నాడు. హీరోగా ప్రియదర్శి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. మల్లేష్, బలగం సినిమాల ద్వారా ప్రియదర్శి మంచి హిట్స్ సాధించాడు. 

Also Read :  తార‌క‌రత్న పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోయే నిర్న‌యం తీసుకున్న బాల‌య్య‌…అదేంటంటే..?

Visitors Are Also Reading