Telugu News » Blog » Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు.వీరందరికి ప్రధాన బేస్ చిరంజీవి అని చెప్పవచ్చు. అలాంటి చిరంజీవి తమ్ముడైన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. అలాంటి మెగా హీరో ఎన్ని కోట్లు సంపాదించారో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. 1990 లో జన్మించిన వరుణ్ తేజ్ బీకాం పూర్తి చేశాడు.. ఆయనకు సినిమాలపై ఉన్న ఆసక్తి వల్ల 2014లో ముకుందా అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

Also read;సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ల రెమ్యునరేషన్స్….ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారంటే…?

Advertisement

ఇక నటనపరంగా చూస్తే ముకుంద సినిమా కాస్త మెప్పించింది అని చెప్పవచ్చు. సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం అందించకపోయినా నటన మాత్రం బాగుంది అని మంచి మార్కులు తెచ్చుకున్నాడు.. ఆయన ఈ మొదటి సినిమాకి 74 లక్షల పారితోషికం తీసుకున్నారట.. ఈ సినిమా తర్వాత వరుసగా కంచె,మిస్టర్, లోఫర్, గద్దల కొండ గణేష్, ఫిదా,ఎఫ్2, ఎఫ్3 వంటి సంచలన సినిమాలు చేశాడు.. వీటిలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. కొన్ని సినిమాలు అనుకొని విధంగా డిజాస్టర్ అయ్యాయి.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు..

ముఖ్యంగా ఆయన కథలకు ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్నారని చెప్పవచ్చు.. అలాంటి వరుణ్ తేజ్ సొంతంగా సినిమాల ద్వారా బాగానే సంపాదించారట.. ఆయన తన సొంత సంపాదనతో గాయత్రి హిల్ లో ఒక గెస్ట్ హౌస్, నాలుగు కార్లు కొన్నారట.అంతేకాకుండా వరుణ్ తేజ్ మణికొండ లో తొమ్మిది కోట్ల విలువచేసే విల్లాలో ఉంటున్నారని, ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా వరుణ్ తేజ్ కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన తొందరలోనే ఇంతటి గుర్తింపు తెచ్చుకోవడం వరుణ్ తేజ్ కే సొంతం.

Advertisement

Also read:big boss 6 telugu: అతడిని విన్నర్ చేయడానికే బిగ్ బాస్ ప్లాన్ చేసిందా..ఆ రూమ్ లో ఏం జరిగిందంటే..?

You may also like