Home » big boss 6 telugu: అతడిని విన్నర్ చేయడానికే బిగ్ బాస్ ప్లాన్ చేసిందా..ఆ రూమ్ లో ఏం జరిగిందంటే..?

big boss 6 telugu: అతడిని విన్నర్ చేయడానికే బిగ్ బాస్ ప్లాన్ చేసిందా..ఆ రూమ్ లో ఏం జరిగిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బిగ్ బాస్ తెలుగు బుల్లితెర రియాలిటీ షోలలో టాప్ పొజిషన్ లో ఉన్న షో బిగ్ బాస్.. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరో సీజన్ కూడా చివరి అంకానికి చేరుకుంది.. 21 మంది కంటెస్టెంట్లతో ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టిన బిగ్ బాస్ సీజన్ 6 ఈసారి అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదని చెప్పవచ్చు.. దీంతో నిర్వాహకులు వారం వారం షో రేటింగ్ పెంచేందుకు సకల ప్రయత్నాలు చేశారు.. ప్రతివారం అనుకోని ఎనిమినేషన్లు చేస్తూ షోను కాస్త ఇంట్రెస్టింగ్ గా తయారు చేశారు. దీంతో గత మూడు వారాల నుంచి షో రేటింగ్ పెరుగుతూ వచ్చింది.. ప్రస్తుతం ఇంకా రెండు వారాలు మిగిలి ఉంది ఈ తరుణంలో విన్నర్ ఎవరు అనేదానిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.. ఈ క్రమంలోనే ఒక అతడే విన్నారంటూ, బిగ్ బాస్ అతడికి హెల్ప్ చేస్తోంది అంటూ ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Advertisement

also read:Railway jobs: టెన్త్, ఇంటర్ పాసయ్యారా.. రాత పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాలు..!!

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతమున్న కంటెస్టెంట్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రేవంత్ ఉన్నారు.. ఇచ్చిన ప్రతి టాస్కును ఆయన పూర్తి చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి విపరీతమైన కోపంతో అందరి పైకి అరుస్తూనే తనదైన స్టాటజీని చూపిస్తూ వస్తున్నారు.. ఇంత కోపం చూపించిన రేవంత్ కు మాత్రం ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతూనే వచ్చింది. ఈ తరుణంలో ఆయన టైటిల్ విన్నర్ కోసం ముందుకు సాగుతున్నాడు.. తాజాగా బిగ్ బాస్ మనీ రివైవల్ టాస్క్ లో విన్నర్ ప్రైజ్ మనీ తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే.. ప్రైజ్ మనీ మళ్ళీ పెంచుకోవాలంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు ఆడాల్సిందే.. దీంతో దయ్యం టాస్క్ ని కూడా నిర్వహించారు.. ఇందులో శ్రీహన్, ఆదిరెడ్డి అదరగొట్టేసారు.. ఈ తరుణంలో శ్రీ సత్యాను కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మన్నారు..

కానీ ఆమె భయంతో వెళ్లలేదు దీంతో డబ్బు కోల్పోవాల్సి వచ్చింది.. ఈ విషయంలో రేవంత్ తన డబ్బులే కట్ అయినట్లుగా శ్రీ సత్య పై విరుచుకుపడ్డాడు.. దీంతో ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.. ఆ తర్వాత రేవంత్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. ఈ రూమ్ లో ఉన్నప్పుడు సూర్య కప్పు వెతకమని టాస్క్ ఇచ్చాడు. అతడు వెతకడం ప్రారంభించగానే దయ్యం రూపంలో ఉన్న ఒకరు కప్పును రేవంత్ ముందు విసిరేశారు.. దీంతో రేవంత్ దాన్ని అందుకుని బయటకు వెళ్లారు.. ఈ జరిగిందంతా చూస్తే మాత్రం బిగ్ బాస్ రేవంత్ ని విజేతగా చేయడం కోసం ఇలాంటి ప్లాన్ చేస్తున్నారని బయట ఉన్న వారికి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading