Home » తెలుగులో యానిమల్ మూవీని ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా ?

తెలుగులో యానిమల్ మూవీని ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా ?

by Anji

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్  సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అర్జున్ రెడ్డి మూవీని  కబీర్ సింగ్ పేరుతో  రిలీజ్ చేసి బాలీవుడ్ లో మంచి హిట్ కొట్టాడు. సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాను చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిపోయాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ తెలుగు వాడు కావడం, రష్మిక మందన్నకి తెలుగులో మంచి మార్కెట్ ఉండడంతో తెలుగులో కూడా ఈ సినిమా హాక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది.


ఈ సినిమా డిసెంబర్ ఒకటో తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు హక్కులను దిల్ రాజు దాదాపు 15 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఉత్తరాంధ్ర, నైజాం ప్రాంతాలలో దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాడు. ఈ రెండు ప్రాంతాల మినహాయించి మిగతా ప్రాంతాలలో దాదాపు 6 కోట్ల వరకు హక్కులను దిల్ రాజు అమ్మేసినట్టు తెలుస్తోంది. నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో 9 కోట్లు కలెక్ట్ చేస్తే దిల్ రాజు సేఫ్ అయిపోతాడు. ఈ సినిమా మీద ఉన్న బజ్ కారణంగా తొమ్మిది కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయమే కాదని అంటున్నారు. విశ్లేషకులు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.


హైదరాబాద్ లో అయితే భారీగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదు అవుతున్నాయి. సినిమా మీద ఉన్న బజ్ ప్రకారం..టాక్ కూడా బాగుంటే నాలుగైదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 15 కోట్ల రూపాయలకు హక్కులు కొనుక్కున్నారు కాబట్టి 16 నుంచి 17 కోట్లు కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అయినట్టే చెప్పాలి. టి సిరీస్ సంస్థతో పాటు సందీప్ రెడ్డి వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ కూడా ఈ సినిమాను నిర్మించింది. బాలీవుడ్ లో అయితే ఈ సినిమాకు పోటీగా విక్కీ కౌశల్ నటించిన శ్యామ్ బహదూర్ కూడా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఆ సినిమా ప్రభావం పెద్దగా చూపించదు. సుడిగాలి సుధీర్ నటించిన కాలింగ్ సహస్రలాంటి చిన్న సినిమాలు ఈ సినిమాతో పోటీ పడే అవకాశాలు అయితే లేవు. కాబట్టి హక్కుల కోసం వెచ్చించిన అమౌంట్ చాలా ఈజీగానే వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading