ప్రేమ రెండు అక్షరాల పదం చూసేందుకు చిన్నదే అయినా చదివేందుకు సలువులుగా ఉన్నా ఇది పెట్టే చిచ్చు, కలిగించే ఆనందం రెండు అనుభవిస్తే కానీ తెలియదు. అందుకే ప్రేమ అగుడ్డిది అని అంటారు. ప్రేమలో పడ్డప్పుడు ప్రేమ మత్తులో ఉన్నప్పుడు ఎవ్వరికీ ఏమి కనపడవు ఏమి వినపడవు ఈ ప్రేమ అనే పద్దం చాలా మంది జీవితాల్లో ఆనందం నింపింది. విషాదాన్ని నింపింది. ఇక ప్రేమ అనే కాన్సెప్ట్‌తో కొన్ని వేల సినిమాలు వచ్చి ఉంటాయి.
Also Read : బజర్దస్త్ నరేష్ వయస్సు ఎంతో తెలుసా..?
Advertisement
అన్ని సినిమాల్లోకి ప్రత్యేకం ప్రేమ దేశం 1996లో దర్శకుడు కదిర్ చేసిన సంచలనమే. కాదల్ దేశం ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోని కుర్రకారుని ఒక రకమైన ఉన్మాదంలో ముంచెత్తిందని చెప్పుకోవాలి. ప్రేమ, స్నేహాలకు ముఖ్యమైన విలువ ఏర్పడే టీనేజ్‌లో ఉన్న వాళ్లందరూ ఈ సినిమాను పదే పదే చూసారు. ప్రేమదేశం సినిమా ఎంతటి ఘన విజయం సాధిందో మనకు తెలిసిందే. అప్పట్లో రికార్డులు తిరిగరాసి సంచలనాలే సృష్టించింది.
ఈ సినిమాలో అబ్బాస్, వినీత్ హీరోలుగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో టబు నటించడం జరిగింది. అబ్బాస్‌కు వినిత్‌కు మంచి క్రేజ్ వచ్చింది. వాస్తవానికి అబ్బాస్‌కు ఇది మొదటి సినిమా కానీ తెరపై ఆయన నటన చూసిన వారెవ్వరూ కూడ అలా ఫీల్ అవ్వలేదు. బాగా అనుభవం ఉన్న నటుడిలాగే యాక్ట్ చేశారు. తొలుత ఈ సినిమాను అబ్బాస్ చేయకూడదు అని నిర్ణయించుకుని రిజెక్ట్ చేశాడట. అసలు అబ్బాస్‌కు ఈసినిమాలో హీరోగా అవకాశం ఎలా వచ్చిందంటే.. కథ రాసుకున్న సమయంలోనే కార్తీక్గా వినిత్‌ను ఎంచుకున్నాడు దర్శకుడు కదిర్. ఇక అరుణ్ పాత్ర కోసం ఎవ్వరూ అయితే బాగుంటారా అని తెగ ఆలోచించారట.
Advertisement
చాలా మంది హీరోలను ప్రయత్నం చేశారట. కానీ వర్క్ అవుట్ అవ్వలేదట. చివరకు ముంబయి నుంచి హాలీడే ట్రిప్ మీద బెంగళూరు వచ్చిన అబ్బాస్‌ను ఓ హోటల్‌లో చూశారట దర్శకుడు. చూడగానే అట్రాక్ట్ అయిపోయిన దర్శకుడు అతన్ని తన అరుణ్ పాత్ర కోసం అడిగాడు. సినిమాల్లో నటించాలని ఉన్నా.. అవకాశం మంచిదే అయినా తమిళం తెలియకపోవడం అబ్బాస్ ఈ సినిమాను వదులుకున్నాడట మొదట. కొద్ది రోజుల తరువాత నిర్మాత కే.టీ.కుంమోన్ ఫోన్ చేస అబ్బాస్‌ను మేకప్ టెస్ట్‌కు రమ్మని పిలిచాడట.
అబ్బాస్‌కు క్లియర్ గా అర్థం అయ్యేవిదంగా ఈ సినిమా తరువాత తన లైఫ్ ఏ విధంగా ఉంటుందో వివరించాడట. ఎట్టకేలకు ఫైనల్‌గా అరుణ్ పాత్రలో అబ్బాస్ నటించడానికి ఒప్పుకుని సినిమా చేశాడు. ఈ సినిమాలో అబ్బాస్ పాత్రకు నటుడు విక్రమ్ తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా అంటే ఇష్టపడ వాళ్లు చాలా మంది ఉన్నారు. అంతలా ఆకర్షించింది ప్రేమదేశం సినిమా.
Aslo Read : శ్రీరామ్ జీవితంలో ఇంత విషాదం ఉందా…? చర్మం పూర్తిగా కాలిపోయి కదల్లేని స్థితిలో…!