Home » శ్రీరామ్ జీవితంలో ఇంత విషాదం ఉందా…? చ‌ర్మం పూర్తిగా కాలిపోయి కద‌ల్లేని స్థితిలో…!

శ్రీరామ్ జీవితంలో ఇంత విషాదం ఉందా…? చ‌ర్మం పూర్తిగా కాలిపోయి కద‌ల్లేని స్థితిలో…!

by AJAY
Ad

సినిమాల్లో కొంత‌మంది ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచి ఆ త‌ర‌వాత క‌నిపించ‌కుండా పోతారు. అలా ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుని క‌నుమ‌రుగైనా వారు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో మాత్రం స్థానాన్ని కోల్పోరు. అలా టాలీవుడ్ లో ప్రేక్ష‌కుల‌కు ఎంతో ద‌గ్గ‌రై ప్ర‌స్తుతం క‌నిపించకుండా పోయిన హీరోల‌లో శ్రీరామ్ కూడా ఒక‌రు. నిజానికి శ్రీరామ్ అస‌లు పేరు శ్రీకాంత్ కాగా ఇండ‌స్ట్రీలో అప్ప‌టికే శ్రీకాంత్ పేరుతో హీరో ఉండ‌టంతో శ్రీరామ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ తమిళ్ లో మాత్రం త‌ను శ్రీకాంత్ గానే ప‌రిచ‌యం అయ్యాడు. ఇక శ్రీరామ్ తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ సినిమాలు చేశాడు.

ALSO READ : నేడు సీఎం జ‌గ‌న్ తో టాలీవుడ్ స్టార్స్ భేటీ..గుడ్ న్యూస్ చెబుతారా..!

Advertisement

hero sriram

hero sriram

నిజానికి శ్రీరామ్ న‌ట‌ప్ర‌స్థానం మొద‌ల‌య్యింది కూడా త‌మిళ పరిశ్ర‌మ‌లోనే…ఇదిలా ఉండ‌గా శ్రీరామ్ త‌ల్లి త‌మిళ్ కాగా తండ్రి తెలుగువారు కావ‌డంతో తెలుగు కూడా స్ప‌ష్టంగా మాట్లాడుతాడు. ఇక సినిమాల విష‌యానికి వస్తే శ్రీరామ్ రోజా పూలు అనే సినిమాతో 2002 లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర‌వాత వ‌రుస‌గా చాలా సినిమాలే చేశాడు. కానీ హీరోగా మాత్రం శ్రీరామ్ కు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఇక శ్రీకాంత్ హీరోగా న‌టించిన సంక్రాంతి సినిమాతో శ్రీరామ్ కు మంచి గుర్తింపు ల‌భించింది.

Advertisement

hero sriram

hero sriram

 

అంతే కాకుండా వెంక‌టేష్ హీరోగా న‌టించిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే సినిమా కూడా న‌టుడిగా శ్రీరామ్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ త‌ర‌వాత స్నేహితుడు సినిమాతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చాడు. త‌మిళ్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో విజ‌య్ జీవ‌తో పాటూ శ్రీరామ్ కూడా న‌టించాడు. కానీ ఈ సినిమా త‌ర‌వాత మ‌ళ్లీ శ్రీరామ్ పెద్ద‌గా స్క్రీన్ పై క‌నిపించ‌డంలేదు. ఇదిలా ఉండ‌గా శ్రీరామ్ ఓ ప్రమాదం లో చ‌నిపోయాడ‌ని అందుకే సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడ‌ని కూడా అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి.

hero sriram wife

hero sriram wife

అయితే తాజాగా ఆలీతో స‌రదాగా టాక్ షోలో శ్రీరామ్ సందడి చేశారు. త‌న‌కు షూటింగ్ లో అగ్నిప్ర‌మాదం జ‌రిగిన విష‌యం నిజ‌మేన‌ని త‌న ఒళ్లంతా కాలిపోయింద‌ని చెప్పాడు. పెద‌వులు చ‌ర్మం పూర్తిగా కాలిపోయి క‌ద‌ల్లేని స్థితిలో ఆస్ప‌త్రిలో చేరాన‌ని తెలిపారు. కానీ ప్ర‌స్తుతం శ్రీరామ్ పూ ర్తిగా కోలుకున్న‌ట్టు క‌నిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రోమోలో ఎంతో హుషారుగా కూడా ఉన్నారు.

Visitors Are Also Reading