Home » బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రన్ టైం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రన్ టైం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ హిందీలో అదే టైటిల్ ఛత్రపతి  సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మే 12న ఛత్రపతి థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా రన్  సమయానికి సంబంధించిన ఓ అప్డేట్ బయటకి వచ్చింది. ఛత్రపతి రన్ టైం 123 నిమిషాలు. అంటే రెండు గంటల మూడు నిమిషాలు అన్నమాట. 

Also Read :  పవన్ కళ్యాణ్‌ సినిమాపై పూనమ్ ఫైర్.. భగత్‌ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్

Advertisement

ఒరిజినల్ వెర్షన్ నిడివి 2:45 నిమిషాలు కాగా..  రెండు సినిమాల మధ్య 42 నిమిషాలు తేడా ఉంది. మరి ఛత్రపతిని నార్తిండియా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా స్టైలిష్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న వివి వినాయక్ హిందీ వెర్షన్ లో ఏఏ సన్నివేశాలను తీసేశాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. మరికొన్ని క్షణాలలోనే ఈ విషయంపై క్లారిటీ  రానుంది. 

Advertisement

Also Read :  అఖిల్ తరువాత మూవీకి బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా ?

ఇప్పటికే విడుదలైన ఛత్రపతి టీజర్, ఛత్రపతి ట్రైలర్స్ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో అందరినీ ఆకట్టుకునేలా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఛత్రపతితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇమేజ్ మరింత పెరిగిపోవడం ఖాయమని తాజా ట్రైలర్ చెప్పేస్తుంది. ఛత్రపతి లో బాలీవుడ్ లెజెండరీ కమెడియన్ జానీ లివర్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ పై బాలీవుడ్ నిర్మాత జయంతి లాల్ గడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ నుస్రత్ బరూసా ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ  మూవీకి తనిష్క్ బాఘ్ ఛీ సంగీతం అందిస్తున్నాడు.

Visitors Are Also Reading