సూపర్ స్టార్ కృష్ణ టార్జాన్ సినిమాల్లో నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. కృష్ణ నటించినటువంటి తొలి జానపద చిత్రమే ఆయనకు మల్టీ స్టార్స్ గా ఫస్ట్ సినిమా కావడం విశేషం. ఆ సినిమా మరేదో కాదండోయ్.. ఇద్దరు మొనగాళ్లు. ఈ చిత్రానికి విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఇందులో ఓ హీరోగా కాంతారావు నటించారు. అప్పటికే గూఢచారి 116 విడుదలై 100 రోజులు ఆడింది. ఈ సందర్భంగా ఇద్దరు మొనగాళ్లు చిత్రంలో నటించాల్సిందిగా కృష్ణ ని దర్శకుడు విఠలాచార్య అడిగారట. వెంటనే ఒప్పుకొని.. ఈ సినిమా కోసం మొదటి సారిగా టార్జాన్ వేషంలో కనిపించారు కృష్ణ.
Advertisement
ఇక ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ గజ పురాధిపతి సింహ బాహు అనే ఒక పాత్రలో నటించగా.. ఆయనకు భార్య పాత్రలో పుష్పకుమారి షీలావతి పాత్రలో నటించారు. వీరికి పుట్టిన సంతానమే కాంతారావు, కృష్ణ. పెద్ద వాడైనా రాజశేఖరుడి పాత్రలో కాంతారావు.. చాలా దూరంగా అడవిలో పెరిగిన చిన్న కుమారుడిగా సూపర్ స్టార్ కృష్ణ కనిపించారు. ఇక కృష్ణకుమారి, సంధ్యారాణి ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించారు. కృష్ణకు జోడిగా నటించిన సంధ్యారాణి అంతకుముందే కన్నె మనసులు అనే సినిమాలో కూడా కృష్ణకి జంటగా నటించింది.
Advertisement
Also Read : 30 ఏళ్ల తరువాత బాలకృష్ణకి ఆ లోటు తీరిందా..?
వాస్తవానికి ఈ సినిమా తొలుత ఫిబ్రవరి 16, 1967లో విడుదల చేయగా.. ఆ రోజుల్లో ఇప్పట్లో మాదిరిగా 24 గంటలకు కరెంట్ ఉండేది కాదు. తీవ్రమైన కరెంటు కోతతో ఉండేవారు అప్పటి జనాలు ఒక థియేటర్లో జనరేటర్లు కూడా ఉండకపోవడంతో విడుదల వాయిదా వేసుకున్నారు చిత్ర బృందం. ఆ తర్వాత ఆ విద్యుత్ కార్మికులు సమ్మె కూడా చేశారు. ఆ సమ్మె ముగిసిన తర్వాత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవని నిర్ధారణ చేసుకున్న తరువాతనే మార్చి 3, 1967న విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత టార్జాన్ గా నటించిన కృష్ణని చూసి ఆయన అభిమానులందరూ ఫుల్ ఖుషి అయ్యారు.
Also Read : ఎంగేజ్మెంట్ అయింది..సరదాగా ఫోన్లు మార్చుకున్నారు..కానీ అమ్మాయి దిమ్మతిరిగింది..!!