Home » ఎంగేజ్మెంట్ అయింది..సరదాగా ఫోన్లు మార్చుకున్నారు..కానీ అమ్మాయి దిమ్మతిరిగింది..!!

ఎంగేజ్మెంట్ అయింది..సరదాగా ఫోన్లు మార్చుకున్నారు..కానీ అమ్మాయి దిమ్మతిరిగింది..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

ప్రస్తుత జనరేషన్ తగ్గట్టే సినిమాలు వస్తున్నాయా.. లేదంటే సినిమాలను బట్టే ప్రస్తుత జనరేషన్ ఫాలో అవుతున్నారా అర్థం కావడం లేదు.. ఈ మధ్యకాలంలో లవ్ టు డే సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఇందులో ప్రేమికులిద్దరూ సెల్ ఫోన్ లు మార్చుకొని, వివాదాలకు పోయి చివరికి అర్థం చేసుకొని మళ్లీ ఒకటవుతారు. అలాంటి ఒక సీను వీరిద్దరి నిజ జీవితంలో జరిగింది. అదేంటో పూర్తి వివరాలు చూద్దాం.. తమిళనాడు రాష్ట్రంలోని బేలూరు కు చెందిన అరవింద్ 23.. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Also Read: మ‌హేశ్ బాబు, ర‌మేష్ బాబులు సినిమాల్లోకి రావ‌డానికి ఎన్టీఆర్ సాయ‌ప‌డ్డార‌ని తెలుసా..? ఎలా అంటే…!

Advertisement

 

 

also read:చిరు ఫేవరెట్ హీరో.. ఆయన డాన్స్ చాలా ఇష్టమట.. గెస్ చేయండి..?

అదే టౌన్ కు చెందిన ఒక యువతి తో కొద్ది నెలల క్రితం అరవింద్ కు నిశ్చితార్థం జరిగింది. ఇక అప్పటినుంచి ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు కలుసుకున్నారు.. ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత, ఫోన్లు మార్చుకోవాలని భావించారు. అలా మార్చుకునే ముందు ఫోన్లో పర్సనల్ డేటా ఎవరూ కూడా డిలీట్ చేయలేదు.. ఒకరి ఫోన్లో ఒకరు మార్చుకొని ఇండ్లలోకి వెళ్లిపోయారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చెక్ చేసుకున్నారు.

Advertisement

ఇంతలో అబ్బాయి ఫోన్ చెక్ చేసిన అమ్మాయికి దిమ్మ తిరిగిపోయింది. అరవింద్ ఫోన్ లో ఒక బాలికకు సంబంధించి ప్రైవేట్ వీడియో ఉంది. అది చూసిన అమ్మాయి షాక్ అయింది. దాని గురించి కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. దీంతో వారి కుటుంబీకులు పెళ్లి రద్దు చేసుకున్నారు. ఈ స్టోరీ అంతటితో ఆగకుండా తన బంధువుల సహకారంతో ఆ వీడియో ఏ బాలికదో తెలుసుకొని వారి కుటుంబీకులను కలిసి విషయం అంతా చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. లవ్ టుడే సీన్ రిపీట్ చేద్దామంటే పోలీసులు వచ్చి అబ్బాయి వీపు పగలగొట్టారు.

also read:

Visitors Are Also Reading