Home » 30 ఏళ్ల తరువాత బాలకృష్ణకి ఆ లోటు తీరిందా..?

30 ఏళ్ల తరువాత బాలకృష్ణకి ఆ లోటు తీరిందా..?

by Anji
Ad

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకి టాలీవుడ్ లో ఎంతటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలయ్య  నుంచి ఒక సినిమా సూపర్ హిట్ అయితే దాని తరువాత వచ్చే సినిమా అంతగా ఆడకపోవడం అనేదినాటి నుంచి వస్తున్నది. దాదాపు 30 ఏళ్లు.. 47 సినిమాలు ఏంటీ ఈ లెక్కలు అని అనుకుంటున్నారా..? వరుసగా రెండు హిట్లు కొట్టడానికి బాలయ్య తీసుకున్న గ్యాప్.  వినడానికి విచిత్రంగా ఉన్నా.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు దగ్గరగా వచ్చారు కానీ గెలుపు, తలుపులు అడుగు దూరంలోనే ఆగిపోయారు బాలయ్య.

veerasimhareddy-review

Advertisement

ఇన్నేళ్ల తరువాత దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని 30 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. ఏడాదికి ఒక సినిమా.. అది కుదిరితే రెండు సినిమాలు చేయడం బాలయ్యకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అలవాటు. ఇప్పటికీ కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. కానీ విజయాల విషయంలో మాత్రం కాస్త వెనకబడే  ఉన్నారు. హిట్ కొట్టినప్పుడు మాత్రం ఆ ఇంపాక్ట్ మరో రెండు మూడేళ్ల వరకు ఉండేలా చూసుకుంటారు బాలయ్య. తాజాగా వీరసింహారెడ్డి తో మరోసారి మాస్ మ్యాజిక్ చేసి చూపించారు బాలయ్య.  జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి 8 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. అఖండ సినిమా కలెక్షన్లను కూడా దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే 8 రోజుల్లో రూ.60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ. 71 కోట్లు వసూలు చేసింది. 

Advertisement

Also Read :  కీర్తి సురేష్ బంగారం పంచడం వెనక ఇంత స్వార్థం ఉందా..?

ఇక ఈ విజయంతో మూడు దశాబ్దాల తర్వాత బాలయ్య వరుసగా రెండు హిట్లు అందుకున్నారు. చివరి సారిగా 1993-1994 సమయంలో బంగారు బుల్లోడు, భైరవ ద్వీపంతో వరుస విజయాలు అందుకున్నారు బాలయ్య. గత 30 ఏళ్లలో 47 సినిమాలు చేసిన బాలయ్య. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రెండు వరస విజయాలు అందుకోకపోవడం గమనార్హం. సమరసింహారెడ్డి తర్వాత వచ్చిన సుల్తాన్ యావరేజ్ దగ్గరే ఆగింది కానీ హిట్ కాదు. ఆ సినిమా తర్వాత అలాంటి యావరేజ్ కూడా రాలేదు. ఈ లోటు ఇన్నేళ్లకు అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో ఆ కోరిక తీరిపోయింది. హ్యాట్రిక్ కొట్టేందుకు  ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. 

Also Read :   చిరు ఫేవరెట్ హీరో.. ఆయన డాన్స్ చాలా ఇష్టమట.. గెస్ చేయండి..?

Visitors Are Also Reading