సినిమా ఇండస్ట్రీలో మంచి స్థానంలో రాణిస్తుండగానే అకస్మాత్తుగా చనిపోయారు. చేతిలో వారికి సినిమాలు ఉండగానే రకరకాల కారణాలతో ఈ లోకాన్ని వదిలివెళ్లారు. అలా చనిపోయిన వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
శ్రీహరి
తెలుగులో పరిచయం లేనటువంటి వ్యక్తి శ్రీహరి. తెలుగు, తమిళం, కన్నడం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా షూటింగ్ లో ఉండగానే అనారోగ్యంతో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో మరణించారు. అక్టోబర్ 09 2013 రోజు ఆయన చనిపోయిన నాటికి ఆయన వయస్సు 49 సంవత్సరాలు. ఆయన చనిపోయిన నాటికి చాలా సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
పునిత్ రాజ్‌కుమార్
కన్నడ పవర్ స్టార్‌గా వెలుగు వెలిగిన పునీత్ తాజాగా జీమ్ వర్కౌట్ చేస్తుండగా గుండెపోటుతో కన్నమూశారు. అక్టోబర్ 29న చనిపోయిన నాటికి ఆయన వయస్సు 46 సంవత్సరాలు. ఆయన మరణం పట్ల కన్నడ సినిమా పరిశ్రమతో పాటు యావద్దేశ వ్యాప్తంగా కంటతడి పెట్టారు.
రఘువరణ్
సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో అద్భుతమైన నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన నటనల్లోను అన్ని రకాల భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. 200లకు పైగా సినిమాలు నటించాడు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో అనేక సినిమాల్లో నటించారు. మార్చి 18, 2008లో లివర్ ప్లాబ్రమ్ మూలంగా 59 సంవత్సరాల వయస్సులో ఆయన మరణించాడు.
Advertisement
Also Read : సంచలనం సృష్టిస్తున్న సినతల్లి ఎవరు?…ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..!
వేణుమాదవ్
దాదాపు 500 సినిమాల్లో కమెడీయన్‌గా నటించాడు. 25 సెప్టెంబర్ 2019 లో లివర్, కిడ్నీ సమస్యతో ఆయన ఈ లోకాన్ని వీడాడు. యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు
ఆర్తి అగర్వాల్
నువ్వు నాకు నచ్చావు సినిమాతో ఓ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత అనేక సినిమాల్లో నటించింది కొన్నాళ్ల తరువాత ఆమె కెరీర్ ఫేడౌట్ అయింది. పెళ్లి కడా చేసుకుని అమెరికాకు వెల్లిపోయింది. అనంతరం భారీగా బరువు పెరగడంతో లైఫ్ సేషన్ ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ ఫెయిల్ కావడంతో ఆమె చనిపోయింది. జూన్ 06, 2015న ఆమె చనిపోయిన నాటికి ఆమె వయస్సు 31 సంవత్సరాలు మాత్రమే.
ఉదయ్ కిరణ్
కుటుంబ కారణాలు, ఆర్థిక సమస్యలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 05, 20లో మృతి చెందాడు. అప్పటికీ అతని వయస్సు 33 సంవత్సరాలు . ఉదయ్ కిరణ్ చనిపోయిన తరువాత అనేక మంది అభిమానులు మెగాస్టార్ ఫ్యామిలీ వైపు వేలు చూపించారు.
Also Read : దైవ దర్శనానికి ఎదురొచ్చిన పెద్దపులి.. ఆ తరువాత ఏమైందంటే..?