Telugu News » Blog » దైవ ద‌ర్శ‌నానికి ఎదురొచ్చిన పెద్ద‌పులి.. ఆ త‌రువాత ఏమైందంటే..?

దైవ ద‌ర్శ‌నానికి ఎదురొచ్చిన పెద్ద‌పులి.. ఆ త‌రువాత ఏమైందంటే..?

by Anji
Ads

దైవ ద‌ర్శ‌నం కోసం వాళ్లు టైగర్ రిజ‌ర్వ్‌లోకి వెళ్లారు కానీ అనుకోకుండా వాళ్ల‌కు పెద్ద‌పులి ఎదురు అయింది. ప్రాణ‌భ‌యంతో  వ‌ణికిపోయారు. బైకుపై వ‌చ్చిన వాళ్లు చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశారు. చెట్టు కింద పులి, చెట్టుమీద ఇద్ద‌రు యువ‌కులు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Ads

Also Read :  ఎన్టీఆర్ : న‌ష్టం వ‌చ్చినా ప‌ర్వాలేదు ఆ సినిమా చేద్దాం

Ads

ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని చాత‌ర్‌పూర్‌లో చోటు చేసుకుంది. ప‌న‌నా టైగ‌ర్ రిజ‌ర్వ్‌లోని ఆల‌యాన్ని సంద‌ర్శించేందుకు ఏడాదిలో ఒక‌సారి అనుమ‌తిస్తారు. ఆ యువ‌కులు దైవ‌ద‌ర్శ‌నం కోసం టైగ‌ర్ రిజ‌ర్వ్ లోకి వెళ్లారు. అదే స‌మ‌యంలో దారిల పులి ఎదురుకావ‌డంతో వాళ్లు చెట్టు ఎక్కారు. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న అట‌వీశాఖ సిబ్బంది ఆ ఇద్ద‌రు యువ‌కుల‌ను కాపాడారు. దీంతోఓ బ్రతుకు జీవుడా అంటూ ఆయువ‌కులు అక్క‌డ నుంచి జారుకున్నారు. ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు గుడికి వెళ్ల‌క‌ముందే దేవుడు క‌నిపించాడుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Ad

Also Read :  ఆదిలాబాద్ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం..!