Home » తల్లి పాత్రల్లో మెప్పించి ఇటీవల మరణించిన నటీమణులు ఎవరో తెలుసా..!!

తల్లి పాత్రల్లో మెప్పించి ఇటీవల మరణించిన నటీమణులు ఎవరో తెలుసా..!!

వీరు ఒకప్పుడు తల్లి పాత్రల్లో మెప్పించి చివరికి కన్నుమూసిన ప్రముఖ నటీమణులు చాలామంది ఈ మధ్య కాలంలోనే మరణించారు.వారిలో కొందరు నటీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1.మంజుల విజయ్ కుమార్: చంటి సినిమా లో మీనాకి అమ్మ ప్రేమను పంచే వదినగా, వాసు సినిమా లో వెంకటేశ్ కోసం అనుక్షణం తపించే తల్లిలా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించిన సీనియర్ నటీమణి. ఈమె 2013 లో చనిపోయారు.

2. మనోరమ : 5 వేల పైచిలుకు స్టేజ్ షో లతోపాటు 1500కు పైగా సినిమాల్లో నటించిన గ్రేట్ యాక్టర్. ఎన్నో తెలుగు సినిమాల్లో తల్లిగా, అమ్మమ్మగా,నానమ్మగా నటించి మెప్పించిన ఈమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును కూడా సొంతం చేసుకోవడం జరిగింది. మనోరమ గారు 2015లో పరమపదించారు.

3.విజయ నిర్మల : ఈమె చాలా సినిమాల్లో తల్లి పాత్రలో నటించింది. కృష్ణ గారిని ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి, అలాగే తేనే మనసును పంచే సీన్లలో తల్లిగా నటించింది.

4.సుజాత: పెళ్లి సినిమాలో అత్తలో అమ్మతనాన్ని చూపించి, చంటి సినిమా లో అమాయకపు కొడుకుని కడుపులో పెట్టుకొని కాపాడే గొప్ప తల్లిగా ప్రేక్షకుల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకుంది. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన గొప్ప నటిమణి. ఈమె మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చింది. ఈమె 2011 లో కాలం చేసింది.

ALSO READ;

ఆలయాన్ని కాపలా కాస్తున్న ఎలుకలు.. అంతుచిక్కని రహస్యాలు మరెన్నో.. ఎక్కడంటే..!!

మీది కుంభరాషా.. వచ్చే 3 నెలల్లో జరగబోయేది ఇదే..!!

 

Visitors Are Also Reading